Saturday, April 20, 2024

చిరు వ్యాపారస్థులు గేటు ఫీజు కట్టనవసరం లేదు…

మొత్తం గేటు గుత్త వేలం పాటను రూ.59 లక్షల కు దక్కించుకున్న ….
వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి విజయానందరెడ్డి

చిత్తూరు – చిత్తూరు నగర పరిధిలో వీధి విక్రయదారులు నుండి కూరగాయలు అమ్ముకునే రైతులకు గేటు ఫీజు భారాన్ని తొలగించేందుకు
వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి విజయానంద రెడ్డి సేవా భావంతో ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పూర్తితో పేదలకు తనవంతు చేయూతనిచ్చేందుకు చిత్తూరు నగరపాలక సంస్థ నిర్వహించిన గుత్తవేలం పాటను రూ.59 లక్షలతో దక్కించుకున్న విజయానంద రెడ్డి బడుగు, బలహీన వర్గాలకు చెందిన వీధి విక్రయదారులకు మేలు చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కూరగాయల మార్కెట్, రోడ్డుపై విక్రయాలు చేసుకునేవారు, పార్కింగ్ ఫీజుతో పాటు , ఎన్టీఆర్ నగరపాలక సంస్థ బస్టాండ్ నందు వ్యాపారులు ప్రభుత్వానికి గేట్ ఫీజు చెల్లించకుండా ఉచితంగా వ్యాపారం చేసుకునేందుకు వీలుగా ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విజయానంద రెడ్డి గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన రైతులు పండించిన కూరగాయలను అమ్ముకునేందుకు మార్కెట్లో ఫీజు కట్టుకునేందుకు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చిందన్నారు. దీంతో వీధి వ్యాపారులు కూడా కష్ట నష్టాలకు గురవుతున్న విషయం తెలిసిందన్నారు. ఈ మేరకు వారికి తన వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పూర్తితో తమ కంపెనీ ఆధ్వర్యంలో మున్సిపల్ టెండర్లను దక్కించుకోవడం జరిగిందన్నారు. ఈ మేరకు నగరంలో వీధి వ్యాపారుల నుండి మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వారు ఉచితంగా టోల్ ఫీజు లేకుండా అమ్ముకోవచ్చని ఆయన తెలిపారు. ప్రజలకు సహాయం చేయాలని తన ఆశయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ మిథున్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, మేయర్ ఆముద, ఉపమేయర్ చంద్రశేఖర్, రాష్ట్ర మొదలియర్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ ల సహకారంతో గేటు ఫీజు టెండర్ ప్రభుత్వ ధరకే దక్కిందని, వారి సహకారంతో పేదలకు మరింత సహాయం అందిస్తానని విజయానందరెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement