Sunday, May 5, 2024

తిరుపతి ఉప ఎన్నికల్లో గురుమూర్తి విజయం తథ్యం – మంత్రి కొడాలి నాని

పిచ్చాటూరు గోవర్సన్ గిరి లో మాజీ ఎమ్మెల్సీ జయచంద్ర నాయుడు స్వగృహంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి కొడాలి నాని,ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి,గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ,ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నికల్లో నిరుపేద కుటుంబానికి చెందిన డాక్టర్ గురుమూర్తి ని అభ్యర్థిగా బరిలోదించరాని,డాక్టర్ గురుమూర్తి సత్యవేడు నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలను పిలుపునిచ్చారు అదేవిధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలపెడుతున్న సంక్షేమ పథకాలను గురించి వివరించారు,ఇప్పడు ఎన్నికల పోటీలో ఉన్న తెలుగుదేశంకు డిపాజిట్లు కూడా రావని,బీజేపి కి నోటా తో పోటీ అని అన్నారు.సిఎం జగన్ ను‌విమర్శించే,హక్కు అర్హత చంద్రబాబుకు లేవని అన్నారు.అనంతరం ఎమ్మెల్సీ జయచంద్ర నాయుడు మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ తరపున పోటీ లో ఉన్న డాక్టర్ గురుమూర్తి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ జగనన్న ఎన్నికల‌ ముందు ఏవైతే హామిలు ఇచ్చారో అవే అమలు చేస్తున్నారు అదేకాకుండా భారత చరిత్రలో ఏ ప్రభుత్వం‌ కూడా అమ్మఒడి లాంటి పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవని అన్నారు.అనంతరం ఎమ్మెల్యే కోనేటి ఆది మూలం మాట్లాడుతూ ప్రియతమ ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కాకముందే మేనిఫెస్టోలో పొందుపరచడం సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుంది అన్నారు అనంతరం.ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ తరపున మన ప్రియతమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి బలపరిచిన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు వైఎస్సార్సీపీ పార్టీ కన్వీనర్ హరి చంద్ర రెడ్డి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నాయుడు, పిచ్చాటూరు రోస్ రెడ్డి, కె.ఆరుముగం రెడ్డి , తొప్పయ్య,పాల్ పద్మనాభం, రవి రాయల్ రమేష్ రాజు,మోహన్, శేఖర్ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement