Thursday, May 2, 2024

వైసిపి నేతల రెండేళ్లలోనే పంచభూతాలను దోచేశారు – టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

రేణిగుంట : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు రెండేళ్లలో పంచభూతాలను దోచేశారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. పట్టణంలోని నక్షత్ర గ్రాండ్ హోటల్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు బెదిరింపులకు టిడిపి భయపడడం లేదని భయపడితే చావడమే ఉత్తమమని ఘాటుగా స్పందించారు. రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదని ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు.రెండేళ్లలో రాష్ట్ర ప్రజలు అనేక కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు సర్వాధికారాలు ఇస్తామన్నారు.తమ రాజకీయ జీవితంలో నియంత ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదన్నారు.తిరుపతి ఎంపీ మృతి చెందితే ఆయన కుటుంబం లో ఎవరికో ఒకరికి ఎంపీ సీటు ఇవ్వడం ఆనవాయితీ. అయితే జగన్ మోహన్ రెడ్డి పాలన లో సొంత పనులు చేసుకునే వ్యక్తి కి ఎంపీ సీట్నుఎలా ఇస్తారని ప్రశ్నించారు. మంత్రులు మదమెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టిటిడి ఒక కుటుంబ సంస్థగా మార్చేశారని పాలను బ్రష్టు పట్టించారని ధ్వజ మెత్తారు. నిత్యావసర ధరలు పెట్రోల్ డీజిల్ కరెంట్ బస్సు చార్జీలు పెంచేసి ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని అన్నారు. జగన్ కనుసన్నల్లో ఎన్నికల కమిషనర్ రావడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, పరసారత్నం, శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి, దామచర్ల సత్య, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, చిత్తూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని, గాజుల ఖాదర్ భాషా, టిడిపి మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి సిటీ సుబ్రహ్మణ్యం, టిడిపి పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, పట్టణ ప్రధాన కార్యదర్శి కొరియర్ రవి, టిడిపి మాజీ మండల అధ్యక్షుడు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, బుజ్జి నాయుడు, మునిస్వామి నాయుడు, చిన్నారెడ్డి, గురవ రాజు పల్లి భాస్కర్ రెడ్డి, అన్నసామి పల్లి భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్ యాదవ్, యేసయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement