Wednesday, May 8, 2024

పరిషత్ నిర్ణయం.. తిరుపతిలో ఎందుకు పోటీ?

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే  ఆనం రామ్ నారాయణరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీని గొంగడితో కప్పేశారని విమర్శించారు. టీడీపీ తరపున జడ్పీటీసీ,ఎంపిటిసిలకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు… చంద్రబాబు చేసిన ఒక్క ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని నేడు చంద్రబాబు భూస్థాపితం చేశారని వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో ఇటువంటి దిగజారుడు ప్రకటన చేయడం చంద్రబాబుకే  సాధ్యమైందన్నారు. నిన్న చంద్రబాబు చేసిన ప్రకటనతో టీడీపీ నిజమైన ఆత్మహత్య చేసుకుందన్నారు.

2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసి సోమశిల- స్వర్ణముఖి లింకు కెనాల్ కు అటవీశాఖ అనుమతుల ఆడంకి సాకు చూపి అనుమతులు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలు బహిష్కరించిన టీడీపీ.. తిరుపతి పార్లమెంట్ ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ఆనం ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement