Monday, May 20, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 10 గంట‌ల స‌మ‌యం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,843 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారికి 31,817 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement