Monday, April 29, 2024

వైసీపీ ఎమ్మెల్యే కీలక నిర్ణయం.. సొంత ఖర్చుతో ఆనందయ్య మందు పంపిణీ

కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఆనందయ్య మందును సొంత ఖర్చుతో పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా శుక్రవారం తిరుపతి రూరల్ మండల ఎంపీడీవో కార్యాలయం కేంద్రంగా ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రారంభించారు.

చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా 1.60 లక్షల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని చెవిరెడ్డి తెలిపారు. వాలంటీర్ల ద్వారా కరోనా మందును పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య సంరక్షణకు తన బాధ్యతగా కృషి చేస్తున్నట్లు చెవిరెడ్డి వెల్లడించారు. మరోవైపు నిరంతరం ఫీవర్ సర్వేను పక్కాగా నిర్వహించేలా తాము చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: విజయసాయి బెయిల్‌ రద్దు: కోర్టు విచక్షణకే వదలి పెట్టిన సీబీఐ

Advertisement

తాజా వార్తలు

Advertisement