Friday, May 10, 2024

వైసిపి దౌర్జ‌న్యాల‌కు అడ్డుక‌ట్ట వేసేది బిజెపినే – సోము వీర్రాజు..

తిరుపతి: వైసిపి దౌర్జన్యాల‌కు అడ్డుక‌ట్ట వేసే శ‌క్తి బిజెపి కి ఉంద‌ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు సోము వీర్రాజు అన్నారు.. తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో స్థానిక‌ కల్యాణ మండపంలో నిర్వ‌హించిన బిజెపి సన్నాహక సమావేశంలో సోము మాట్లాడుతూ, వైసిపి నేత‌ల బెదిరింపుల‌కు బిజెపి భ‌య‌ప‌డ‌బోద‌ని తేల్చి చెప్పారు.. ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడకుండా వైకాపా ఏ ఎన్నికల్లోనైనా విజయం సాధించిందా? అంటూ ప్రశ్నించారు. ఈ ఉప ఎన్నిక‌ల‌లో తిరుప‌తి అభివృద్ధి అజెండాగా ప్ర‌చారం నిర్వ‌హిస్తామ‌న్నారు.. జ‌న‌సేన నేత‌ల‌తో, కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌సి ఈ ఎన్నిక‌ల‌లో ముందుకు వెళ‌తామ‌ని పేర్కొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement