Sunday, April 28, 2024

హాలీవుడ్ హీరోపై సంచలన ఆరోపణలు చేసిన యువతి

హాలీవుడ్ హీరో ఆర్మీ హ్యామర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. హ్యామర్ తనను మెంటల్‌గా, ఎమోషనల్‌గా, లైంగికంగా వేధించాడని ఎఫీ అనే 24 ఏళ్ల మహిళ గురువారం నాడు ఓ ప్రెస్‌మీట్‌లో ఆరోపించింది. హ్యామర్‌ను ఫేస్‌బుక్‌ ద్వారా 2016లో మీట్ అయిన ఎఫీ.. 2020 వరకు రిలేషన్‌షిప్‌ కొనసాగించినట్లు పేర్కొంది. ఏప్రిల్ 24, 2017న తనపై నాలుగు గంటల పాటు హింసాత్మకంగా అత్యాచారం చేశాడని, పదే పదే తలను గోడకు కొట్టేవాడని ఆరోపించింది. ఈ క్రమంలో తలకు, ముఖానికి గాయాలయ్యాయని తెలిపింది. వీటన్నింటిని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పింది. దీంతో ఈ కేసులో అమెరికా పోలీసుల విచారణ కోనసాగుతోంది. కాగా ఫిబ్రవరి 3 నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లు లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

అయితే ఈ ఆరోపణలను హీరో ఆర్మీ హ్మామర్ ఖండించాడు. అతడు తన లాయర్‌తో కలిసి ప్రెస్‌‌మీట్‌లో ఏర్పాటు చేసి మాట్లాడాడు. ఎఫీతో పాటు ఇతర సెక్సువల్ పార్ట్‌నర్స్ అందరితోనూ తన రిలేషన్స్ అగ్రిమెంట్ ప్రకారమే జరిగాయని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ముందుగా చర్చించుకున్నాకే తాము రిలేషన్‌షిప్‌లోకి వచ్చామని వివరించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement