Thursday, April 25, 2024

పరిశ్రమల వద్ద ప్రమాదాల నివారణ మాక్ డ్రిల్ చేపట్టాలి : కలెక్టర్

తిరుపతి : జిల్లాలో పరిశ్రమల్లో పూర్తి స్థాయి భద్రత ప్రమాణాలు అమలు చేయాలని, రసాయన ప్రమాదాలు నివారణకు, ప్రమాదాలు సంభవించినప్పుడు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై సత్వరమే స్పందించి నివారించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి సంబంధింత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మొదటి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన క్రైసిస్ గ్రూప్ సభ్యులైన‌ పరిశ్రమల ప్రతినిధులతో, అగ్నిమాపక, ఫాక్తరీస్ , కాలుష్య నియంత్రణ, రెవెన్యూ, పోలీస్, వైద్య, తదితర అధికారులతో సమావేశమై పలు సూచనలు చేసి, దిశా నిర్దేశం చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ మహ పరిశ్రమలు ప్రమాదకర జాబితాలో ఉన్న ఫ్యాక్టరీలు, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రమాదకర కెమికల్స్ రూల్స్ – 1996 మేరకు తిరుపతి జిల్లాలో 11 మహా జాబితాలో ఉన్నాయని తెలుపుతూ ఈ యూనిట్లలో ఏదైనా రసాయన ప్రమాదం సంభవించినప్పుడు ఆన్ సైట్ లో పరిశ్రమల యాజమాన్యం ముందస్తుగా ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఆఫ్‌సైట్ చర్యల్లో భాగంగా ప్రధాన అత్యవసర పరిస్థితుల్లో జిల్లాలోని సంక్షోభ సమూహం( క్రైసిస్ సభ్యులు) సకాలంలో ప్రతిస్పందించి అగ్ని, పేలుడు, విషపూరిత వాయువులు విడుదల వాటి కలయికతో ఏర్పడే ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు నిరంతర అప్రమత్తంగా వుండాలని ఆదేశించారు.

జిల్లాలోని వివిధ శాఖలు అయిన ఫ్యాక్టరీల శాఖ, అగ్నిమాపక శాఖ, వైద్య తదితర శాఖలు సకాలంలో స్పందించి ప్రాణ నష్టం , ఆస్తి నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని , ఇందు కొరకు జిల్లా క్రైసిస్ గ్రూప్ ఒక ప్రణాళికను ఎక్స్పర్ట్ కన్సల్టెన్సీ వారితో సంప్రదించి అతి త్వరలో రూపొందించాలని అన్నారు. పై తెలిపిన పరిశ్రమలలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిబంధనల మేరకు సేఫ్టీ చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులలో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కలిగి వాటికి సంబంధించిన పరికరాల పనితీరు ఎప్పటికప్పుడు తనిఖీ చేపట్టాలని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే జిల్లాలో ఆఫ్ సైట్ రెస్క్యూ చర్యల అత్యవసర ప్రణాళికలు త్వరిత గతిన సిద్ధం కావాలని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారిని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక క్రైసిస్ గ్రూపులు శ్రీకాళహస్తి, నాయుడుపేట, సూళ్లూరుపేట డివిజన్ల లో ఏర్పాటు కావాలని తెలిపారు. ఫైర్ డిపార్ట్మెంట్ వారిచే పరిశ్రమల్లోని సిబ్బందికి అగ్ని ప్రమాద నివారణ, ప్రమాద సమయాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, ఆన్ సైట్ శిక్షణ ఇవ్వాలని తదనుగుణంగా పరిశ్రమల యజమానులు చర్యలు చేపట్టాలని తెలిపారు. అగ్నిమాపక, పోలీస్, పబ్లిక్ హెల్త్ రెవెన్యూ రవాణా వైద్య పొల్యూషన్ కంట్రోల్ జిల్లా పరిశ్రమల అధికారి అగ్రికల్చర్ అధికారులు వారి వారి విధులు ఈ అత్యవసర పరిస్థితులలో పూర్తిస్థాయిలో పనిచేసేలా ఉండాలన్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆదేశాల మేరకు ఈనెల 23న ఎం.ఏ.హెచ్ – ఏ కేటగిరి పరిశ్రమలలో అత్యవసర మాక్ డ్రిల్ చేపట్టనున్నారని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణ రెడ్డి, అడిషనల్ ఎస్పీవెంకట్రావు, జిల్లా ఫైర్ ఆఫీసర్ రమణయ్య, గూడూరు ఆర్డిఓ కిరణ్ కుమార్, జిల్లా రవాణా అధికారి సీతారాం రెడ్డి, ఏపీఐఐసీ జెడ్ ఎం చంద్రశేఖర్, ఎన్విరాన్ మెంట‌ల్ ఈ ఈ నరేంద్ర, వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement