Sunday, May 5, 2024

ఎన్నికల కౌంటింగ్ కు కట్టు దిట్ట మైన భద్రత కల్పించాలి

.మదనపల్లి రూరల్ రేపు జరిగే మునిసిపల్ ఎన్నికలు ఓట్లు లెక్కంపు లలో కట్టు దిట్ట మైన పోలీస్ భద్రత ను ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం డీఎస్ ని కలిసి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన బాబు వినతి పత్రం అందజేశారు. ఓట్లు లెక్కింపులో అవకతవకలు కు పాల్బడే అవకాశం ఉన్నందున భద్రత పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ విషయాన్ని డిఏస్పి తో చర్చించి వినతి పత్రం అందించారు. అలాగే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం లో మదనపల్లి పట్టణంలో కౌంటింగ్ జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు మరియు పోలీసు వ్యవస్థ ను పాటిష్టంగా ఏర్పాటు చేయాలని కోరారు. అలాగె వినతి పత్రం అందజేశారు. ఓట్ల లెక్కింపులో సిబ్బంది ని, అధికార పార్టీ ఇబ్బంది పెట్టకుండా సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే దౌర్జన్యాలు జరగకుండా తగు భద్రత చర్యలు తీసుకోవాల్సిందిగా మదనపల్లి డీస్పీకి, మరియు సబ్ కలెక్టర్ ఆఫీసు ఏఓ కు వినతిపత్రం అందజేశారు.అనంతరం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు విలేకరులతో మాట్లాడుతు అధికారం యంత్రంగం అప్రమత్తం గా లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో రాజంపేట పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, పట్టణ అధ్యక్షుడు మోడెం సిద్ధప్ప, కౌన్సిలర్ అభ్యర్థి మల్లికార్జున నాయుడు తో పాటు పలువురు పాల్గొన్నారు.ఫోటోఎంపిఎల్ 6. డీఎస్పీ కి వినతిపత్రం అందిస్తున్న శ్రీరామ్ చినబాబు.

Advertisement

తాజా వార్తలు

Advertisement