Monday, May 13, 2024

మ‌ల్ల‌న్న సేవ‌లో సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌..

కర్నూలు/ శ్రీశైలం: మ‌ల్ల‌న్న సేవ కోసం శ్రీ‌శైలం వ‌చ్చారు సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ‌. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆదివారం శ్రీశైలం మహాక్షేత్రానికి విచ్చేశారు. జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులకు దేవాదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్, కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి విఆర్ కె కె సాగర్, జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి లవన్నలు పుష్పగుచ్ఛం, పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. తెలంగాణ చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ దంపతులు, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వి.రవీంద్రబాబు, ఎస్సీ ఎస్టీ స్పెషల్ జడ్జి విఎయల్ సత్యవతి, మొదటి అదనపు జిల్లా జడ్జి బి.శ్రీనివాస్, ఆత్మకూరు జూనియర్ సివిల్ జడ్జి రాజన్ ఉదయ్ ప్రకాష్ తదితరులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వెంట వున్నారు.

అనంతరం వారు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ధూళి దర్శనం చేసుకున్నారు. తొలుత రాజగోపురం వద్ద ఆలయ వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం వారిని ఆలయంలోకి తీసుకువెళ్లి రత్నగర్భ గణపతి, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రత్యేక ధూళి దర్శనం చేయించారు. అనంతరం వారు కంచి మఠంలో వేదపండితులు నిర్వహిస్తున్న చండీ, రుద్ర హోమాలను దర్శనం చేసుకున్నారు.
కర్నూలు ఆర్ డి ఓ హరిప్రసాద్, ఆత్మకూరు డిఎస్పి శృతి, దేవస్థాన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement