Sunday, April 28, 2024

AP : కుప్పంలో చంద్ర‌బాబు…

సొంత నియోజకవర్గం కుప్పంలో ఇవాళ, రేపు కుప్పంలో పర్యటించనున్నారు టిడిపి అధినేత చంద్ర‌బాబు. ఈ క్ర‌మంలో ఈ ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి కుప్పం వచ్చారు. హెలిపాడ్ వ‌ద్ద ఆయనకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

అనంత‌రం చంద్రబాబు కొత్తపేట కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు..కాగా రెండు రోజుల పాటు కుప్పంలో ఉండే చంద్ర‌బాబు పార్టీకి చెందిన నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు.. ఇది ఇలా ఉంటే ఈ నెల 27 నుంచి చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement