Monday, April 29, 2024

గిద్దలూరులో చంద్రబాబురోడ్ షో.. అడ్డుకున్న పోలీసులు

గిద్దలూరు పట్టణంలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబుకు గిద్దలూరు లోని గాంధీబొమ్మ కూడలిలో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. గిద్దలూరులో చంద్రబాబు రోడ్డు షో నిర్వహించారు. చంద్రబాబు రోడ్ షోలో టీడీపీ సాంగ్స్ వేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆగ్రహంతో పోలీసులు వెనక్కి తగ్గారు. కాగా.. బద్వేల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement