Sunday, May 5, 2024

పవన్ ముసుగు వెనుకాల చంద్రబాబు.. పేర్ని నాని

పవన్ ముసుగు వెనుకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజకీయ ముఖచిత్రం మారబోతోంది అంటున్నాడు..అంటే చంద్రబాబుతో కలిసి వెళ్తాడని అన్నారు. చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకోవడానికి లగ్నం దగ్గర పడిందన్నారు. దాన్ని బయటకు చెప్పలేక ప్రజల్ని, అభిమానుల్ని మోసం చేసే ప్రక్రియ ఇదని అన్నారు. పార్టీ పెట్టి 175స్థానాల్లో ఒక్క చోట కూడా పోటీ చేయకపోతే ప్యాకేజీ స్టార్ అనరా అన్నారు. దత్తపుత్రుడి ముసుగు తొలగిపోయిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement