Thursday, April 25, 2024

Mirchi Price : దేశీ మిర్చికి ఆల్‌టైమ్ రికార్డు ధర.. క్వింటాల్‌కు రూ. 90 వేలు

వరంగల్ : మిర్చి ధ‌ర బంగారాన్ని మించేసింది. ఆల్‌టైమ్ రికార్డు ధర పలికి మిర్చి రైతుల్లో ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపింది. క్వింటాలుకు ఏకంగా రూ.90 వేలు పలికి.. రికార్డు నమోదు చేసుకుంది. వరంగల్ గ్రైయిన్ మార్కెట్ లో రైతులు తీసుకొచ్చిన దేశీ మిర్చి ఈ రికార్డు ధర పలికింది. మిగతా మిర్చికి మాములు రేట్లే రావటం గమనార్హం. మిర్చి ధర పైకి ఎగబాకుతూ.. లక్షకు చేరువలో ఉండడంతో మిర్చి రైతుల్లో ఎనలేని సంతోషం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement