Saturday, May 4, 2024

జయలలిత మరణంపై అనుమానం-శశికళతో పాటు పలువురిని విచారించాలని సిఫారసు

జయలలిత మరణంపై ఆర్ముగస్వామి కమిషన్ ఇప్పటికే తన నివేదికను తమిళనాడు సర్కారుకి అందజేసింది. ఈ నివేదికలోని పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనారోగ్య సమస్యలతోనే జయలలిత మరణించినా.. ఆమె మరణించిన సమయం, జయలలితకు అందిన వైద్య చికిత్సలపై కమిషన్ సందేహాలు వ్యక్తం చేసింది. అంతేకాకుండా జయలలిత నెచ్చెలి శశికళను విచారిస్తే ఈ వ్యవహాంలో అసలు విషయాలు వెలుగు చూస్తాయంటూ కమిషన్ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. జయలలిత 2016 డిసెబర్ 5న మరణించినట్లు వైద్యులు చెబుతున్నా… తాము విచారించిన సాక్షుల మాట ప్రకారం ఆమె 2016 డిసెంబర్ 4వ తేదీనే మరణించారని కమిషన్ పేర్కొంది. ఈ లెక్కన జయలలిత మరణించిన మరునాడు ఆమె మరణాన్ని ప్రకటించారని తెలిపింది.

జయలలిత మరణంపై శశికళతో పాటు ఆమె బంధువు అయిన వైద్యుడు, జయకు వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించిన డాక్టర్ శికుమార్, నాడు వైద్య, ఆరోగ్  శాఖ మంత్రి విజయ్ కుమార్, ఆ శాఖ కార్యదర్శిలపై విచారణ జరిపితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. జయ మరణంపై నెలకొన్న అనుమానాలు వీడాలంటే శశికళతో పాటు పైన చెప్పిన వారందరినీ విచారించాల్సిందేనని కూడా కమిషన్ తన నివేదకలో తెలిపింది.జయలలిత మరణంపై తనకు అనుమానాలున్నాయని ఆమె ముఖ్య అనుచరుడు, మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. నాడు సీఎంగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి…ఈ అనుమానలను నిగ్గు తేల్చేందుకు ఆర్ముగస్వామి కమిషన్ ను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement