Sunday, December 8, 2024

చంద్రబాబు బీసీల ద్రోహి.. వైసీపీ రాజ్యసభ అభ్యర్థి కృష్ణయ్య

అమరావతి, ఆంధ్రప్రభ : చంద్రబాబు బీసీల ద్రోహి అని వైకాపా రాజ్యసభ అభ్యర్థి కృష్ణయ్య మండిపడ్డారు. సీఎం జగన్‌ బీసీలను అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు సిగ్గుండాలని, ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన స్థాయికి తగ్గట్టు- మాట్లాడాలని హితవు పలికారు. జగన్‌ను విమర్శించే ముందు చంద్రబాబు బిసిలకు ఏమి చేసాడో చెప్పాలన్నారు. చంద్రబాబుకి బీసీల ఓట్లు- కావాలి.. కానీ వాళ్లు ఎదిగితే ఓర్వలేరన్నారు. చంద్రబాబు ఏనాడైనా బీసీలకు ఇన్ని మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లు- ఇచ్చారా? అని ప్రశ్నించారు.పార్లమెంటు-లో బీసీ బిల్లు పెట్టాలని ఎన్ని సార్లు అడిగినా బాబు స్పందించలేదని ఆరోపించారు.

తెలంగాణలో బిసి జాబితా నుంచి తొలగించిన కులాలు కోసం మొదటి నుంచి పోరాటం చేస్తోంది తానేనన్నారు. దేశంలో ఎవ్వరూ సీఎం జగన్‌లా బీసీలకు మేలు చేయలేదన్నారు. బిసి సబ్‌ ప్లాన్‌తో పాటు-, అన్నిరంగాల్లో బిసిల అభివృద్ధికి సీఎం జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జగన్‌ అన్ని రంగాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని నలభై ఏడేళ్లలో బీసీలను ఇంతలా ప్రోత్సహించే సీఎంను చూడలేదన్నారు. బీసీల హక్కుల కోసం రాజ్యసభలో పోరాడాలని తనకు అవకాశం ఇచ్చారన్నారు. బీసీలంతా ఎప్పటికీ సీఎం జగన్‌ వెంటే ఉంటారని ఆర్‌ కృష్ణయ్య స్పష్టం చేసారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement