Monday, April 29, 2024

ఆంధ్రప్రదేశ్‌లో బల్క్ డ్రగ్ పార్క్.. ఎంపీ సత్యవతి ప్రశ్నకు కేంద్ర జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : 13 రాష్ట్రాలు బల్క్ డ్రగ్ పార్కుల పథకానికి ప్రతిపాదనలు పంపాయని, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా వైసీపీ అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి దేశంలో బల్క్ డ్రగ్ పార్కుల ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుత స్థితి ఏంటి? ఇందుకోసం ఏమైనా ప్రతిపాదనలు వచ్చాయా? వాటి వివరాలు తెలియజేయాలని కోరారు. ఆమె ప్రశ్నలకు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖా సహాయ మంత్రి భగవంత్ ఖూబా శుక్రవారం బదులిచ్చారు. ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్‌మెంట్ బల్క్ ప్రమోషన్ కోసం ఓ పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు.

డ్రగ్ పార్క్‌ల కింద దేశంలోని మూడు రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందించాలని తెలిపారు. బల్క్ డ్రగ్ పార్కులలో సాధారణ మౌలిక సదుపాయాల కల్పన, పథకం వివరాలు, మార్గదర్శకాలను డిపార్టమెంట్ వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చని కేంద్రమంత్రి సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement