Thursday, March 28, 2024

కండిషన్స్​ అప్లై: పోలవరంపై కేంద్రం మరో ట్విస్ట్.. సామాజిక, ఆర్థిక సర్వే మరోసారి చేయాలే

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పోలవరం నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం మరో ట్విస్ట్ ఇచ్చింది. సామాజిక, ఆర్థిక సర్వేను తాజాగా మరోసారి నిర్వహించాల్సిందేనని షరతులు విధించింది. వైసీపీ పార్లమెంట్ సభ్యులు బ్రహ్మానందరెడ్డి, సత్యవతి, రెడ్డప్పలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు శుక్రవారం రాతపూర్వకంగా జవాబిచ్చారు. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌పై డీపీఆర్ తయారు చేయాల్సిందేనని మరో నిబంధన పెట్టినట్టు వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో గడువు షెడ్యూల్ చెప్పాలని కేంద్ర జలశక్తి శాఖ కోరిందన్నారు.

పోలవరం నిర్మాణంలో ప్రస్తుతానికి రూ.15668 కోట్ల వరకే తమ బాధ్యతని ఆయన తేల్చి చెప్పారు. ఫిబ్రవరి 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 14336 కోట్లు మాత్రమేనని, ఇందులో రూ. 12311 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తిరిగి చెల్లించిందని తెలిపారు. రూ. 437 కోట్లకు పోలవరం ఆథారిటీ బిల్లులు పంపిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement