Thursday, May 9, 2024

కోడి పందేలకు రెడీ అవుతున్న‌ దళారులు.. చేతులు మారుతున్న నోట్ల క‌ట్ట‌లు

పీలేరు (కడప) ప్రభ న్యూస్‌ : : కోడి పందెం.. దీనిని మనం కోస్తా ప్రాంతంలో ప్రధానంగా వింటుంటాం. బొబ్బిలి యుద్ధం జరిగింది కోళ్ల పందాలతో నేనని మన చరిత్ర చెబుతోంది. రాయలసీమలో అటువంటివన్నీ విన సొంపు దగ్గర కథలుగా మారిపోయాయి. కంప్యూటర్‌ ఇవ్వమొచ్చింది. ఎవరికి వారు బిజీగా మారిపోయారు. ఎప్పుడో ఎక్కడో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో సరదాలకు కూడా కోడి పందాలు ఆడడం బాగా తగ్గిపోయింది. అలాంటి తరుణంలో కోడి పందాల నిమిత్తం రకరకాల పుంజుల కోసం ఒక గ్రామంలో సంతే జరుగుతుందంటే నమ్మగలరా. నమ్మాల్సిందే. ఎందుకంటారా? గ్రామీణ ప్రాంతాల్లో పండిన వ్యవ సాయ పంటలు కూరగాయల కోసం సంతలు నిర్వహించడం సర్వసాధారణం.

రాయలసీమలో ప్రధానంగా కర్నూలు అనంతపురం జిల్లాలో ఈ సంతలు మనకు కనిపిస్తుంటాయి. అలాంటి కోవకు చెందిన ఒక సంత పూర్తిగా కోడిపుంజులకు పరిమితమై కొక్కరోకో అని కూత వేస్తోంది. ఇప్పుడు ఆ సంతలో పందాలకు పనికి వచ్చే కోడి పుంజులు తప్ప మరేవీ కనిపించలేదంటే అక్షరాల నమ్మాల్సిందే. అది ఎక్కడో కాదు అన్నమయ్య జిల్లా పీలేరులో. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఆదివారము ఆ సంతకు కోడిపుంజులు రావడం విశేషం.

- Advertisement -

పీలేరు.. కోడి పందాల జోరు..

సంక్రాంతి పండుగ సీజన్‌ వచ్చిందంటే పీలేరు చుట్టు పక్కల, పడమట మండలాల ప్రాంతాల్లో కోడిపందాలు జోరుగా నిర్వహిస్తారు. ఈ ఆట ప్రభుత్వ పరంగా నిషేధం ఉన్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉంటారు. సరదా-కై-తే పర్వాలేదు కానీ.. ఈ కోడిపందాలలో వేలకు వేలు.. లక్షలకు లక్షలు వెచ్చించి పందాలు నిర్వహిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పందెంలో గెలిచినవారు కుషీ కుషీ గా హంగామా చేస్తుంటారు. ఓడిన వారు నిరుత్సాహంగా వెనుతిరిగి మరుసటి రోజు గెలవడానికి తగిన పుంజులను వెతుకుతారు. అందుకోసం రూ.లక్షలు ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. ఈ కోడిపందేల జూదంలో లక్షలకు లక్షలు అప్పులైన వారు కొల్లలు. ఆలవాలమైన పీలేరు మార్కెట్‌ యార్డు.. నియోజకవర్గ కేంద్రమైన పీలేరు పట్టణం నడిబొడ్డున మార్కెట్‌ యార్డ్‌ ఆవరణం కోడిపుంజుల సంతకు ఆలవాలమైంది.

ఆదివారం ఈ సంతకు భారీగానే పందెంకోళ్లు వచ్చాయి. గతంలో ఈ మార్కెట్‌ యార్డు లో ప్రతి ఆదివారం గొర్రెలు మేకలు, పశువుల సంత నిర్వహిస్తూ ఉండేవారు. సంక్రాంతి పండుగ దగ్గర పడే కొద్ది అవన్నీ మాయమై ఆ సంత కేవలం పందెం కోళ్ల కే పరిమితమైంది. ఆదివారం పీలేరు సంతలో ఎటు చూసినా పందెం కోళ్ళు.. వ్యాపారస్తులు.. దళారుల తో కిటకిటలాడింది. ఈ పరుసకు (సంతకు) పీలేరు ప్రాంతవాసులే కాకుండా చుట్టు పక్కల చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలోని వ్యాపారస్తులు, దళారులు, కోళ్లు మేపుకునేవారు కోడి పందెం రాయుళ్లు పందెం కోళ్ళు తీసుకొని వచ్చారు. దీంతో ఇక్కడ పీలేరు మార్కెట్‌ యార్డ్‌ ఆవరణమంతా కిటకిటలాడింది.

నెమళ్లు.. డేగల రకాలకు భలే గిరాకీ..

పీలేరు సంతలో కాకి నెమలి కాకి డేగలకు భలే గిరాకీ కనిపించింది. సరగా తెల్ల కోడి పింగళి డేగ కోడి తొడ కోడి మైలు కోడి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. వీటి ధర సాధారణంగా రూ.1500 నుండి రూ.25 వేల వరకు పలుకుతున్నాయి ఈ సంతలో సుమారు వేల కోళ్లు బేరం జరిగాయి. వేలకు వేలు.. లక్షలకు లక్షలు నగదు దళారుల చేతులు మారాయి. ఇక్కడ కొన్న పందెంకోళ్లను మారుమూల గ్రామాలకు తీసుకెళ్లి బ్యాచులు బ్యాచులుగా పందాలు నిర్వహిస్తూ వేలకు వేలు లక్షలు బెట్టింగులు కడుతూ పందాలు నిర్వహించడం విశేషం. అప్పుడప్పుడు పోలీసులు దాడులు నిర్వహిస్తూ చూసి చూడనట్లు వ్యవహరిస్తుంటారనే అభిప్రాయాలున్నాయి. అయితే పలుకుబడి ఉన్నవారు పోలీసులకు మామూలు ఇచ్చి వారి నుండి తప్పించుకుంటారో, పలుకుబడులేనివారు కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతుంటారనే విమర్శలున్నాయి.

కోసకోడికి భలే డిమాండ్‌..

కోసకోడి అంటే.. రెండు కోళ్లను పందెంలోకి దించినప్పుడు ఓడిన కోడిని కోసకోడి అంటారు. పందెం కోసం బలవర్ధకమైన ఆహారంతో మేపిన ఆ కోడి మాంసం భలే రుచి అని పీలేరు ప్రాంతం వాళ్ళు అంటు-ంటారు. అందుకే కోసకోడికి భలే డిమాండ్‌ ఉంటు-ంది. మాంస ప్రియులు మామూలు రేటు- కంటే అధిక ధరలు పెట్టి పందెంలో చనిపోయిన కోళ్లను కూడా కొంటూ ఉంటారు. ఏది ఏమైనా పీలేరు సంత కోడిపందాలకు అడ్డాగా మారి కోస్తాతో సరితూవుతోందంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement