Tuesday, May 14, 2024

Breaking: రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇప్పటికే నిందితుడు కుంచాల శశికృష్ణ పై హత్యానేరం రుజువైందని ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న కోపంతో నిందితుడు కుంచాల శశికృష్ణ.. గత సంవత్సరం ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా 24 గంటల్లోనే శశికృష్ణను పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో 36 మందిని విచారించిన పోలీసులు 15 రోజుల వ్యవధిలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. ఈ హత్య కేసులో కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి.. ఇరువర్గాల వాదనలు విని ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. తీర్పును ఇవాళ్టి(ఏప్రిల్ 29)కి రిజర్వ్ చేశారు. కేసు పుర్వాపరాలను పరిశీలించిన కోర్టు.. ఇవాళ మరోసారి పరిశీలించి తీర్పును వెలువరించింది. శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement