Thursday, May 2, 2024

వరికెపూడిశెల ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ భూమి ప్రతిపాదనల ఆమోదానికి సహకరించండి : శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పల్నాడు ప్రాంతవాసుల ఏడు దశాబ్ధాల కల వరికెపూడిశెల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 19.13 హెక్టార్ల అటవీ భూమి విషయంలో వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972లో సెక్షన్‌ 29 కింద వన్యప్రాణుల జాతీయ బోర్డు స్టాండింగ్‌ కమిటీ ఆమోదాన్ని పొందేందుకు రాష్ట్ర ప్రిన్సిపాల్‌ ఛీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ పంపిన ప్రతిపాదనల ఆమోదానికి సహకరించాలని కేంద్ర మంత్రిని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అభ్యర్థించారు.

పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగు, తాగునీటి అవసరాలు తీర్చే వరికెపూడిశెల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అనుమతుల కోసం ఢిల్లీలో కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు శాఖ మంత్రి భూపిందర్‌ యాదవ్‌తో శ్రీకృష్ణదేవరాయలు బుధవారం భేటీ అయ్యారు.

వెల్దుర్తి మండలం, గుంగలకుంట గ్రామం వద్ద నాగార్జున సాగర్‌ సమీపంలో నిర్మిస్తున్న వరికెపూడిశెల ప్రాజెక్టులో ముఖ్య భాగాలైన పంప్‌హౌస్‌ నిర్మాణం, ప్రెషర్‌ మెయిన్‌ బ్రేక్‌ ప్రెజర్‌ ట్యాంక్, గ్రావిటీ మెయిన్‌లో కొంత నిర్మాణం కోసం అటవీ భూమి ఆవశ్యకతను ఆయనకు వివరించారు. విభజన కోసం ప్రతిపాదించిన ప్రాంతం నాగార్జున –శ్రీౖశైలం టైగర్‌ రిజర్వ్‌ కోర్‌ ఏరియాలోకి వస్తుందని తెలిపారు. అనుమతులు వస్తే ఈ ప్రాజెక్టు విషయంలో ముందడుగు పడుతుందని ఎంపీ కేంద్రమంత్రికి విన్నవించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement