Friday, May 17, 2024

ఉపరాష్ట్రపతి నివాసంలో సురభి నాటకాల ప్రదర్శన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నూతన సాంకేతికతను వినియోగించుకుంటూ సురభి నాటకాలు ప్రదర్శిస్తున్న తీరు అభినందనీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలో వెంకయ్యనాయుడు దంపతుల సమక్షంలో శ్రీ వినాయక నాట్యమండలి (సురభి) ఆధ్వర్యంలో నాటకాల ప్రదర్శన జరిగింది.

శ్రీ వినాయక నాట్య మండలి (సురభి) ప్రదర్శించిన మాయాబజార్, భక్త ప్రహ్లాద, శ్రీనివాస కల్యాణం, లవకుశ నాటకాలు ఎంతో నయనానందకరంగా ఉన్నాయని, మనసుకు ఎంతో ఆనందం కలిగిందని వెంకయ్య అన్నారు. ముందు తరాలకు నాటకం మరింత చేరువ చేసే విధంగా సురభి ప్రదర్శనలు సాగుతున్న తీరును మెచ్చుకోకుండా ఉండలేమని అభిప్రాయపడ్డారు. తరతరాలుగా వస్తున్న సురభి నాటకాన్ని బతికించుకుంటున్న శ్రీ వినాయక నాట్యమండలి ఆయన అభినందనలు తెలిపారు. యువత ఈ తరహా నాటకాలకి మరింత ప్రోత్సాహం అందించాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement