Tuesday, May 7, 2024

AP – సైకో పాలనలో నేనూ బాధితుడినే – చంద్రబాబు

విజయవాడ – జగన్ హయాంలో ప్రజలే కాదు నేనూ బాధితుడినే అని చంద్రబాబు వాపోయారు. విజయవాడలో ”విధ్వంసం” పుస్తకావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేశ్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

దేశంలో ఇదే తొలిసారి. పాలనపై విధ్వంసం అనే పుస్తకం రావడం మొదటిసారిగా చూస్తున్నా. నా మనసులోనే కాదు 5 కోట్ల ప్రజల మనసులో ఉంది విధ్వంసం పుస్తకంలో రాశారు. సైకో పాలనలో మన పిల్లల భవిష్యత్తు విధ్వంసమైంది. ఈ ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసం అయ్యింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తున్నారంటే పాలన ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు.

30వేల ఎకరాలు 33వేల మంది రైతులు రాజధాని కోసం భూమి ఇచ్చారంటే అది త్యాగం. రాష్ట్రం బాగుపడాలని స్వచ్చందంగా ముందుకు వచ్చి 30వేల ఎకరాలు ఇచ్చారు. అమరావతిలో రాజధాని కట్టి ఉంటే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి ఉపాధి దొరికేది. అమరావతి నిర్మించి ఉంటే 2 లక్షల కోట్లు వచ్చేవి. రాష్ట్ర ప్రజల ఆస్తిని విధ్వంసం చేశారు. నాల్గవ రాజధాని హైదరాబాద్ కావాలని మాట్లాడుతున్నారు. సిగ్గు ఎగ్గు ఉంటే అలా మాట్లాడతారా? నాల్గవ రాజధాని కోసం పోరాడతామంటే సిగ్గుపడాలి. ప్రజావేదిక కూల్చి అలా వదిలేశారు. నేను చూసి బాధపడాలని. నేను అడిగానని ప్రొక్లైనర్లతో కూల్చి విధ్వంసం చేశారు. వచ్చే పరిశ్రమలను తోసేసిన ముఖ్యమంత్రిని రాజకీయ చరిత్రలో మొదటిసారి చూశా. అమర్ రాజా ఇండస్ట్రీని వేధిస్తే తెలంగాణకు పోయింది. గల్లా జయదేవ్ తన వ్యాపారం కాపాడుకోవాలి కాబట్టి రాజకీయాలకు దూరమవ్వాల్సిన పరిస్ధితి ఏర్పడింది. నేను, పవన్ కలిసి పోరాడతాం” అని చంద్రబాబు అన్నారు.

ఈ పుస్తకం..భవిష్యత్తు రాజకీయాలకు గీటురాయి

పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. ”విధ్వంసం పుస్తకంలో కొన్ని పేజీలు చదివాను. ప్రజల పక్షాన రాశారు. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది. వైకాపా వ్యతిరేక ఓటు ఎందుకు చీలకూడదో ఈ పుస్తకంలో వివరించారు. 2019 నుంచి ఈరోజు వరకు చాలా ఇబ్బందులు పడ్డాం. రాష్ట్రంలో ప్రజలు అనుభవించిన కష్టాలను ఇందులో రాశారు. విధ్వంసం పుస్తకం భవిష్యత్తు రాజకీయాలకు గీటురాయిగా ఉంటుంది” అని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement