Sunday, May 5, 2024

AP: కాంగ్రెస్ అభ్యర్ధుల మూడో జాబితా విడుదల… 10స్థానాల్లో అభ్యర్ధుల మార్పు…

అమ‌రావ‌తి – ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. 38 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సోమవారం విడుదల చేశారు. ఈ జాబితాలో గతంలో ప్రకటించిన 10స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. 28 స్థానాలకు కొత్త అభ్యర్థులు ప్రకటించగా 10స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది. శ్రీకాకుళం, గజపతినగరం, తాడికొండ, ఒంగోలు, కనిగిరి, కోవూరు, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, హిందూపురం నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే పార్టీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్‌ చీరాల బరిలో నిల్చోనున్నారు.

కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో 5 ఎంపీ, 114 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక రెండో జాబితాలో 12 అసెంబ్లీ స్థానాలకు, 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. కాగా ఆదివారం విడుదల చేసిన జాబితాలో మరో 9ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

కాగా, మరో నాలుగు ఎంపీ, మిగిలిన అసెంబ్లీ స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది.
అభ్యర్థులు వీళ్లే..

- Advertisement -
  • శ్రీకాకుళం – అంబటి కృష్ణారావు (పాడి నాగభూషణరావు స్థానంలో)
  • బొబ్బిలి- మరిపి విద్యాసాగర్‌
  • గజపతినగరం- దోలా శ్రీనివాస్‌ (కురిమినాయుడు స్థానంలో)
  • నెల్లిమర్ల – ఎస్‌.రమేశ్‌కుమార్‌
  • విశాఖపట్నం ఉత్తరం – లక్కరాజు రామారావు
  • చోడవరం – జగత్‌ శ్రీనివాస్‌
  • యలమంచిలి – టి.నర్సింగ్‌ రావు
  • పి.గన్నవరం (ఎస్సీ) – కె.చిట్టిబాబు
  • ఆచంట – నెక్కంటి వెంకట సత్యనారాయణ
  • విజయవాడ (ఈస్ట్‌) – సుంకర పద్మశ్రీ
  • జగ్గయ్యపేట – కర్నాటి అప్పారావు
  • తాడికొండ (ఎస్సీ) – మణిచల సుశీల్‌ రాజా (చిలకా విజయ్‌ కుమార్‌ స్థానంలో..)
  • రేపల్లె – మోపిదేవి శ్రీనివాసరావు
  • తెనాలి – ఎస్‌కే బషీద్‌
  • గుంటూరు వెస్ట్‌ – డాక్టర్‌. రాచకొండ జాన్‌ బాబు
  • చీరాల – ఆమంచి కృష్ణమోహన్‌
  • ఒంగోలు – తుర్లపాక నాగలక్ష్మీ (బుట్టి రమేశ్‌బాబు స్థానంలో)
  • కనిగిరి – దేవరపల్లి సుబ్బారెడ్డి (కదిరి భవానీ)
  • కావలి – పొదలకూరి కల్యాణ్‌
  • కోవూరు – నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి (నెబ్రంబాకం మోహన్‌ స్థానంలో)
  • సర్వేపల్లి – పి.వి. శ్రీకాంత్‌రెడ్డి (పూల చంద్రశేఖర్‌ స్థానంలో)
  • గూడురు (ఎస్సీ) డాక్టర్‌. యు రామకృష్ణారావు (వేమయ్య చిలుకూరి స్థానంలో)
  • సూళ్లూరుపేట(ఎస్సీ- చందనమూడి శివ (గడి తిలక్‌బాబు స్థానంలో)
  • వెంకటగిరి – పి.శ్రీనివాసులు
  • కడప- తుమ్మన్‌ కల్యాల్‌ అస్జల్‌ అలీఖాన్‌
  • పులివెందుల- మూలంరెడ్డి ధ్రువకుమార్‌ రెడ్డి
  • జమ్మలమడుగు – బ్రహ్మానందరెడ్డి పాముల
  • ప్రొద్దుటూరు – షేక్‌ పూల మహ్మద్‌ నజీర్‌
  • మైదుకూరు- గుండ్లకుంట శ్రీరాములు
  • ఆళ్లగడ్డ- బారగొడ్ల హుస్సేన్‌
  • శ్రీశైలం- అసర్‌ సయ్యద్‌ ఇస్మాయిల్‌
  • బనగానపల్లె – గూటం పుల్లయ్య
  • డోన్‌ – గారపాటి మధులెట్టి స్వామి
  • ఆదోని – గొల్ల రమేశ్‌
  • ఆలూరు – నవీన్‌ కిషోర్‌ ఆరకట్ల
  • కల్యాణ్‌దుర్గం- పి. రాంభూపాల్ రెడ్డి
  • హిందూపురం – మహ్మద్‌ హుస్సేన్‌ ఇనయతుల్లా (వి నాగరాజు స్థానంలో)
  • ధర్మవరం- రంగాన అశ్వర్థ నారాయణ

Advertisement

తాజా వార్తలు

Advertisement