Monday, April 29, 2024

ports & shipping: ఏపీలో కొత్త ప్రాజెక్టులకు కేంద్ర సహకారం!

కేంద్ర పోర్టులు, ఓడరేవులు, వాటర్ వేస్ మంత్రి సబరనాథ్ సోనోవల్ ని  ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ లకు రావలసిన నిధులపైన ప్రధానంగా చర్చించారు. గతంలో ఈ శాఖలకు కేంద్ర మంత్రిగా మనుసుఖ్ మాండవీయ ఉన్న నేపథ్యంలో ప్రస్తుత సోనోవల్ కి ఏపీ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికను మరోసారి వివరించిచారు. 3 పోర్టులు, 11 ఫిషింగ్ హార్బర్ లకు అందించాల్సిన నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించారు.

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీలో మేజర్ పోర్టును గుర్తించి నివేదిక అందించాలని కేంద్ర మంత్రి సోనోవల్ తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం ఏర్పాటైన గత రెండున్నరేళ్ల కాలంలో ఏపీ మారిటైమ్ బోర్డును స్థాపించి, ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా కోస్టల్ కారిడార్ డెవలప్ మెంట్ చేశామన్నది కేంద్ర మంత్రికి మంత్రి మేకపాటి వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకనమిలో ఏపీ ఏ విధంగా కీలకంగా వ్యవరిస్తుందన్న దానిపై కూలంకషంగా చర్చించారు మంత్రి మేకపాటి.

సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం 2030 కల్లా ప్రస్తుతం 4 శాతంగా ఉన్న ఎగుమతులను 10శాతం లక్ష్యంతో ముందుకెళుతోందని కేంద్ర మంత్రి సోనోవల్ కి మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఎగుమతులకు సంబంధించిన వాణిజ్య ఉత్సవం – 2021ని విజయవంతంగా నిర్వహించామని స్పష్టం చేశారు. ఏపీ కొత్తగా చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకూ సహకరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement