Thursday, May 2, 2024

AP | ఐదేళ్ల నరకానికి ఇది చెక్ పెట్టే సమయం.. సిద్ధం అంటున్న వారిపై యుద్ధం చేద్దాం : చంద్రబాబు

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా కోనసీమ అంబేద్కర్ జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జన సేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… సీఎం జగన్‌పై చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు… సిద్ధం అంటున్న వారిపై యుద్ధం చేద్దామని పవన్ చెప్పారు అని తెలిపారు.

ఒక చాన్స్ అంటే నమ్మి అందరూ ఓటేశారని.. ఇప్పుడు మీలో బాధ, ఆవేదన కనిపిస్తోందని అన్నరు. ఇవాళ, నేను పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చింది మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు.. సిద్ధం సిద్ధం అంటున్న వాళ్లకు మర్చిపోలేని యుద్ధం ఇద్దామని అన్నారు. ఐదేళ్ల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు, కష్టాలకు ఇది చెక్ పెట్టే సమయం… ఈ సారి మీరు కొట్టే దెబ్బ జగన్ కు అదిరిపోవాలి… మళ్లీ ఇంట్లోంచి బయటికి రాకుండా చితక్కొట్టండి… అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత ఉండేది… ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే గ్యారెంటీ లేని పరిస్థితి. మ‌ళ్లీ ఉద్యోగాలు రావాలంటే మా కూటమి రావాలి. అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని.. అదే మా కమిట్ మెంట్ అని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మేం స్వీకరిస్తున్నాం. బీసీలకు ఒక డిక్లరేషన్ ప్రకటించాం. ఈ డిక్లరేషన్ తో బీసీల తలరాత మారుతుంది. 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తాం. సబ్ ప్లాన్ ద్వారా ఏడాదికి రూ.30 వేలు… ఐదేళ్లలో రూ.1.50 లక్షలతో బీసీలను ఆర్థికంగా ముందుకు తీసుకువస్తాం. ఇదే కాదు… స్థానిక సంస్థల్లో మళ్లీ 34 శాతం బీసీ రిజర్వేషన్లు తీసుకువస్తాం అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement