Tuesday, May 7, 2024

AP: వచ్చే వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు..

అమరావతి, ఆంధ్రప్రభ : ఖరీఫ్‌ సీజన్‌లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ఈ ఏడాది 50 లక్షట టన్నులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈనెల రెండవ వారం నుంచి రాష్ట్రంలోని 8774 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు- చేస్తున్నారు. ఈ మేరకు వరి సాగు చేసిన రైతులు, పంట విస్తీర్ణం, దిగుబడి వివరాలతో కూడినప ఈ-క్రాప్‌ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు వచ్చింది. రైతు భరోసా కేంద్రా(ఆర్‌.బి.కె) వద్ద ఈనెల 6 శనివారం నుంచి సామాజిక తనిఖీల్లో భాగంగా ఈ-క్రాప్‌ జాబితాను కూడా అందరికీ తెలిసేలా అందుబాటు-లో ఉంచే ప్రక్రియను ప్రారంభించారు.

ఇప్పటివరకు సుమారు 40 లక్షల వరి సాగు వివరాలు ఈ-క్రాప్‌ లో నమోదు కాగా క్షేత్రస్థాయి అధికారులు 37 లక్షల ఎకరాలను పరిశీలించి సర్టిఫై చేశారు. ఖరీఫ్‌ లో 21,71,708 మంది రైతులు వరిని సాగు చేయగా 15,37,269 మంది ఇప్పటివరకు ఈ-క్రాప్‌ లో వివరాలు నమోదు చేశారు. ఈ-క్రాప్‌ లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా నమోదు ప్రక్రియనంతటినీ యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ ఫాం రైతు భరోసా (యూడీపీఆర్బీ) యాప్‌ సాయంతో ప్రభుత్వం ఆధునీకరి స్తోంది. ఈ-క్రాప్‌ పూర్తయిన రైతులకు డిజిటల్‌ రసీదును కూడా అందచేస్తున్నారు. యూడీపీఆర్‌బీ యాప్‌లో పొందుపర్చిన అన్ని వివరాలను ధాన్యం కొనుగోలు చేసే రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు అనుసంధానం చేస్తున్నారు.

ఆ శాఖ ప్రొక్యూర్‌ మెంటు- యాప్‌ కు కూడా ఈ-క్రాప్‌ అనుసంధానమవుతోంది. ఫలితంగా ఏ దశలోనూ ఈ-క్రాప్ లో నమోదయిన తరువాత రైతులు, పంట వివరాల్లో తేడాలుండే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ-క్రాప్‌ నమోదు విధానం, ప్రయోజనాలపై ఆర్‌.బి.కేల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులు (వి.ఎ.ఎ) అవగాహన కల్పిస్తున్నారు. ఆర్‌.బి.కేల పరిధిలో ఉండే వి.ఎ.ఎల ను రైతులు సంప్రదిస్తే ఈ-క్రాప్‌ ప్రక్రియను పూర్తి చేస్తారు..ఇప్పటికే ఈ-క్రాప్‌ చేసి చేర్పులు, మార్పులు అవసరమైన రైతులు కూడా వి.ఎ.ఎలను సంప్రదిం చాలని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ-క్రాప్‌ పూర్తయితే ప్రొక్యూ ర్‌మెంట్‌ ఏజెన్సీల వద్ద సమాచారం ఉంటు-ంది..ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తవు..దళారుల ప్రమేయానికి ఆస్కారమే ఉండదు..పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ విషయంలోనూ రైతులకు ప్రయో జనం కలుగుతుందని అధికా రులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement