Sunday, December 8, 2024

AP: తిమ్మ సముద్రంలో మిజోరాం గవర్నర్

ఒంగోలు : తన సొంత గ్రామానికి రావడానికి సంతోసంగా ఉందని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. గురువారం ఎన్. జి.పాడు మండలం తిమ్మ సముద్రం గ్రామంలో ఆయ‌న పర్యటించారు. తిమ్మసముద్రం గ్రామంలో ఇటీవల చ‌నిపోయిన ఆయ‌న‌ సోదరి అన్నపూర్ణమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మిజోరాం గవర్నర్ ను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్.పి.మల్లికా గార్గ్ , చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి, ఎస్. ఎన్. పాడు ఎమ్మెల్యే టి.జె.ఆర్. సుధాకర్ బాబు, కరణం వెంకటేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు, మాజీ ఎమ్మెల్యే సాంబయ్య మర్యాద పూర్వకంగా కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement