Monday, May 6, 2024

ఏపీ వైపు దూసుకు వస్తున్న ‘ మోచా ‘ తుఫాను

ఢిల్లీ/అమరావతి – రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. 6వ తేదీన తుఫానుగా మారుతుందని.. దీని ప్రభావం ఒడిశా, ఏపీ రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తుఫాను వస్తే దానికి మోచా అనే పేరు పెట్టనున్నారు. గత ఏడాది ఇదే నెలలో మే 22న అసని తుఫాను బీభత్సం సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రతికూల పరిస్థితులు కనిపించేలా ఉన్నాయని చెబుతున్నారు. ఏపీ వాతావరణంలో రానున్న 48 గంటల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని ఐఎండీ తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహపాత్ర ఈ వివరాలను వెల్లడించారు. ‘

‘మే 6 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశముంది. ఆ మరుసటి రోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై మే 9వ తేదీ నాటికి తుపానుగా బలపడే అవకాశముంది. ఈ తుపాను ఉత్తర దిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది” అని ఆయన తెలిపారు..ఈ తుపాను ఏర్పడితే దానికి ‘మోచా అని పేరు పెట్టనున్నట్లు ఐఎండీ తెలిపింది. యెమెన్‌ దేశంలోని పోర్టు నగరం మోచా పేరుమీదుగా పేరు పెట్టినట్టు పేర్కొంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత తుపాను దిశ గురించి మరింత కచ్చితమైన సమాచారం తెలుస్తుందని ఐఎండీ వెల్లడించింది. వచ్చేవారంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement