Saturday, May 4, 2024

ఏపీలో కొత్తగా 10,373 మందికి కరోనా.. మరణాలు ఎన్నంటే..

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 88,441 మంది సాంపిల్స్ పరీక్షించగా 10,373 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైరస్ కారణంగా 80 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కోవిడ్ నంఉచి 15,958 మంది పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 17,49,363కి చేరగా.. 11,376 మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,28,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో చిత్తూరులో 12, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందారు. కర్నూలు, నెల్లూరు పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు, తూర్పూగోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో 5, కృష్ణలో 4, ప్రకాశంలో 3 కడపలో ఒక్కరు మరణించారు.  అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1880 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం 1002, చిత్తూరు 1728, గుంటూరు 691, కృష్ణ 511, కర్నూల్ 505, నెల్లూరు 459, ప్రకాశం 659, శ్రీకాకుళం 383, విశాఖపట్నం 693, విజయనగరం 309, పశ్చిమగోదావరి జిల్లాలో 309 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement