Tuesday, April 30, 2024

AP CM – మూడో రోజూ కడప లో జగన్ – పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

కడప: కడప నగరంలో రూ.871.77కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అందులో రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ పార్కు అభివృద్ధి పనులను, రూ. 5.61కోట్లతో పూర్తయిన రాజీవ్‌ మార్గ్‌ అభివృద్ధి పనులను ప్రారంభించి కడప ప్రజలకు అంకితం చేయబోతున్నారు. అలాగే రూ.15కోట్లతో రెజూవనేషన్‌ ఆఫ్‌ పుట్లంపల్లె లేక్‌(అమృత్‌ 2.0),పాత మున్సిపల్‌ కార్యాలయ ఆవరణంలో రూ.31.17కోట్లతో నిర్మించనున్న కడప నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు.

రూ.106.44కోట్లతో కడప కార్పొరేషన్‌ బలహీనవర్గాల హౌసింగ్‌ కాలనీలకు నీటిసరఫరా మరియు సీవర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసేందుకు, రూ.20కోట్లతో బుగ్గవంకపై రెండు నూతన వంతెనల నిర్మాణానికి, రూ.50.22కోట్లతో కడపలో సీవరేజ్,సెపె్టడ్‌ మేనేజ్‌మెంట్‌కు, బ్రహ్మంసాగర్‌ నుంచి కడప కార్పొరేషన్‌కు నీటి సరఫరా చేసేందుకు అమృత్‌ 2.0 కింద రూ.572.76కోట్లతో రూపొందించిన ప్రాజెక్టుకు, రూ.69.20కోట్లతో మేజర్‌ స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజీ సిస్టమ్‌కు శంకుస్థాపన చేయనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement