Monday, December 9, 2024

AP: టేస్ట్ లో అదుర్స్.. అందుకే మన చేపలకు ఫుల్ డిమాండ్

అమరావతి ఆంధ్రప్రభ: మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపలకు మహాగిరాకీ ఉంటోంది. రుచి ఎక్కువ కాబోలు కొనడం.. తినడం బాగా పెరిగాయి. దీంతో ఉత్పత్తి… ఎగుమతులు జోరందుకున్నాయి. రాష్ట్రంలో ఏటా 43 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతోంది. సముద్రం నుంచి సేకరించే వాటితో పాటు చేపల చెరువుల నుంచి కూడా ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఒక రకంగా ఏపి అక్వా హబ్‌గామారింది. అనేక మంది రైతులు సాధారణ పంటలకు గుడ్‌బై చెప్పి చేపల చెరువులను తవ్వించి అక్వా కల్చర్‌ను కొనసాగిస్తున్నారు. దేశంలోని మత్స్య ఉత్పత్తులతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ నుంచే 30 శాతం మత్స్య ఉత్పత్తులు జరుగుతున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో 18.63 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు జరుగు తుండగా అదే గుజరాత్‌లో 8.69 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. మత్స్య ఉత్పత్తులు అన్నింటి కన్నా గోదావరిలో లభించే పులస చేపలకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. అక్కడ పులస కిలో మూడు వేల రూపాయల ధర పలుకుతుందంటే దానికి ఉన్న డిమాండ్‌ను అర్ధం చేసుకోవచ్చు. చేపల వినియోగంలో ఏపితో పాటు పాండిచ్చేరి, ఒడిశా, కర్ణాటక, అస్సాం, మణిపూర్‌, ఉత్తర ప్రదేశ్‌ ముందంజలో ఉన్నాయి. లక్ష ద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని ప్రజలు చేపలను ఎక్కువగా వినియోగిస్తుంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల మేరకు చేపలు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు . చేపల్లో ఒమెగా ఫ్యాటీ ఆవ్లూలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నందు వల్ల చేపల వినియోగంపై ప్రజలు మక్కువ చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్వా హబ్‌లను అభి వృధ్ది పరచి ప్రజలకు ఆరోగ్యకరమైన మత్స్య ఉత్పత్తులను అందించేందుకు ఇప్పటికే కార్యా చరణను రూపొందించింది. చే

Advertisement

తాజా వార్తలు

Advertisement