Tuesday, April 30, 2024

Big Story: మిల్కీవేను దాటేసిన పరిశోధనలు.. బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్న మరో గ్రహం..

Space explorations: ఖగోళం అంటేనే అంతులేని రహస్యాలకు నెలవు. అంతరిక్షానికి చెందిన ఏ చిన్న విషయమైనా అందరినీ అబ్బురపరుస్తుంటుంది. స్పెస్ లో వెలుగులోకి వచ్చే ప్రతి అంశమూ ఇప్పటి విజ్ఞానానికి ఓ సవాల్ విసురుతూనే ఉంటుంది. అసలు విశ్వాన్ని ఊహించుకుంటే.. అందులో ఎన్నో గెలాక్సీలు.. మనలాంటి సౌర కుటుంబాలు ఎన్నో ఉంటాయి. గ్రహాలు.. ఉపగ్రహాలతో ఇట్లా ఎంతో ఇంట్రస్ట్ గా అనిపిస్తుంది. మనిషి జీవించడానికి లేదా భూమితో సారుప్యం గల గ్రహాల కోసం శాస్త్రవేత్తల అన్వేషణ కొనసాగుతోంది.. ఈ క్రమంలో ఇప్పటి దాకా పాలపుంత (milky way) లోనే నాలుగు వేల గ్రహాలను కనుగొన్నారు సైంటిస్టులు.

ఖగోళం అంటేనే అంతులేని రహస్యాలకు నెలవు. అంతరిక్షానికి చెందిన ఏ చిన్న విషయమైనా అందరినీ అబ్బురపరుస్తుంటుంది. స్పెస్ లో వెలుగులోకి వచ్చే ప్రతి అంశమూ ఇప్పటి విజ్ఞానానికి ఓ సవాల్ విసురుతూనే ఉంటుంది. అసలు విశ్వాన్ని ఊహించుకుంటే..  అందులో ఎన్నో గెలాక్సీలు.. మనలాంటి సౌర కుటుంబాలు ఎన్నో ఉంటాయి.  గ్రహాలు.. ఉపగ్రహాలతో ఇట్లా ఎంతో ఇంట్రస్ట్ గా అనిపిస్తుంది.  మనిషి జీవించడానికి లేదా భూమితో సారుప్యం గల గ్రహాల కోసం శాస్త్రవేత్తల అన్వేషణ కొనసాగుతోంది..

ఈ క్రమంలో ఇప్పటి దాకా పాలపుంత (milky way) లోనే నాలుగు వేల గ్రహాలను కనుగొన్నారు సైంటిస్టులు. ఎక్స్ రే వేవ్‌లెంగ్త్స్ ఆధారంగా గ్రహాలను కనుగొంటున్నామని, దీని ద్వారా ఇతర గెలాక్సీల్లోని గ్రహాలను కనుగొనడం సులవవుతుందని భావిస్తున్నట్టు సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్త రొసానీ డిస్టెఫానో వివరించారు. భూమిపైన, అంతరిక్షంలోని టెలిస్కోపుల సహాయంతో శాస్త్రవేత్తలు సుదూర తీరాల నుంచి వెలువడుతున్న కాంతులను పరిశీలిస్తున్నారు. ఎక్స్ రే కిరణాల బ్రైట్‌నెస్‌ ద్వారా గ్రహాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

తాజాగా వర్ల్‌పూల్ గెలాక్సీ నుంచి వచ్చిన ఆ ఎక్స్ రేలను పరిశీలించి ఈ మేరకు అంచనా వేశారు. ‘‘నక్షత్రం నిరంతరం కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. ఆ నక్షత్రం నుంచి వచ్చే కాంతి కొంత కాలం నిలిచిపోయిందంటే దాని ముందు నుంచి ఏదో వస్తువుకు వెళ్తున్నట్టు అర్థం చేసుకోవాలి’’ అని సైంటిస్టులు తమ అధ్యయనానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇదే సూత్రం ఆధారంగా ఎక్స్ రే కిరణాలు పరిశీలించారు. ఇందులో తేడాను కనీసం ఒక మూడు గంటలపాటు కనుగొన్నారు. అంటే ఆ కాలంలో గుర్తించిన గ్రహం ఒక నక్షత్రం ముందు నుంచి కదిలి వెళ్లిపోయినట్టు భావిస్తున్నారు. వీటి ఆధారంగానే ఆ గ్రహం శనిగ్రహం సైజులో ఉండవచ్చని వివరిస్తున్నారు. ఈ గ్రహం ఒక భారీ బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్నట్టు తెలిపారు.

‘దురదృష్టవశాత్తు.. ఈ గ్రహాన్ని మరోసారి ధ్రువీకరించడానికి దశాబ్దాలు పట్టవచ్చు. ఎందుకంటే ఆ గ్రహం ఒకసారి దాని కక్ష్యను పూర్తి చేసుకోవడానికి ఎంత కాలం పడుతుందో మనకు తెలియదు. కాబట్టి, ఆ గ్రహాన్ని మరోసారి చూడటానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేం’ అని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకురాలు నియా ఇమారా వివరించారు. 

ఒకవేళ అక్కడ నిజంగా ఒక గ్రహంగా ఉండిఉంటే దాని చరిత్ర బీభత్సంగా ఉంటుందని అస్ట్రానామర్లు చర్చిస్తున్నారు. అక్కడి బ్లాక్ హోల్ లేదా న్యూట్రాన్ స్టార్‌ ఏర్పడటానికి భారీ విస్ఫోటనం జరిగి ఉంటుందని, దాన్ని ఎదుర్కొని ఆ గ్రహం నిలబడి ఉండాలని వివరించారు. అంతేకాదు, బ్లాక్ హోల్‌తోపాటుగా కదులుతున్న మరో నక్షత్రం కూడా త్వరలోనే విస్ఫోటనం చెందే అవకాశముంటుందని, తద్వారా ఆ గ్రహం ఇంకో విపత్తుకూ లోనుకావాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement