Wednesday, April 17, 2024

కాంగ్రెస్ లో టీడీపీ రక్తం.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన కామెంట్

హుజురాబాద్ ఉపఎన్నికలో ఘోర ఓటమి కాంగ్రెస్ లో చిచ్చ రాజేసింది. టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కొందరు సీనియర్లు టార్గెట్ చేస్తూ అదే పనిగా విమర్శలకు పదను పెడుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో కష్టపడిన వారికి పదవులు దక్కడం లేదని బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమ్ సాగర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఏం లేదని అన్నారు. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ఒక్కరేనా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. తనను ఎప్పుడు ఏ మీటింగ్ కి పిలువలేదన్నారు. పీఏసీలో తనను 13వ మెంబర్ గా ఎలా పెడతారని నిలదీశారు. కావాలనే ప్రతిసారి తనను అవమానపరుస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. పార్టీకి నష్టం జరిగితే మాత్రం ఊరుకోననని స్పష్టం చేశారు. హుజురాబాద్ లో తన అవసరం లేదనుకున్నానని చెప్పారు. అందుకే క్రికెట్ చూసేందుకు వెళ్లానని తెలిపారు. ఒక్కసారి కూడా హుజురాబాద్ లో సభ పెట్టలేదన్నారు. కాంగ్రెస్ లో టీడీపీ రక్తం నింపుతున్నారని వ్యాఖ్యానించారు. పీసీసీలో టీడీపీ వారికే పదవులు ఇచ్చారని ఆరోపించారు. మాణిక్కం ఠాగూర్, హుజురాబాద్ ఎన్నికపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ గాంధీకి వివరిస్తానని చెప్పారు. నాకు పీసీసీ ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం చెబితే పార్టీ కోసం పని చేసేవాడినని తెలిపారు. సొంత ఎజెండాతో పార్టీ ఎప్పుడూ బలోపేతం కాదన్నారు. సీనియర్లను కాదని నిర్ణయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో కంటే ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటోందని కోమటిరెడ్డి తెలిపారు.

ఇది కూడా చదవండి: ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్: కేసీఆర్ సర్కార్ పై ఉత్తమ్ ఫైర్

Advertisement

తాజా వార్తలు

Advertisement