Monday, May 6, 2024

అంగన్‌వాడీ, ఆశ వర్కర్ల ఉద్యమం అణచివేత నిరంకుశత్వం.. హామీలు నెరవేర్చాలని కోరితే అరెస్టులా: నారా లోకేష్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ ఎన్నో హామీలిచ్చారని, ప్రభుత్వంలోకొచ్చాక ఆ హామీలు నెరవేర్చాలని కోరుతూ అంగన్‌ వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్ల శాంతియుతంగా ఉద్యమిస్తే పోలీసుల్ని ప్రయోగించి నిర్దాక్షిణ్యంగా అణచి వేస్తున్నారని, ఇది నిరంకుశత్వమేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. అంగన్‌ వాడీ, నేడు ఆశా వర్కర్లని అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తూ మంగళవారం మీడియాకి లోకేష్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. పాదయాత్రలో వెంట ఉండి నడిచిన అంగన్‌ వాడీ, ఆశా అక్కాచెల్లెళ్లమ్మలకి ఇచ్చిన హామీలలో ఒక్క-టైనా నెరవేర్చని ముఖ్యమంత్రి తీరుని నిరసిస్తూ, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనే డిమాండ్‌తో ఆందోళనకి దిగిన మహిళల్ని అరెస్టు చేయడం వైసీపీ అరాచకపాలనకి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంగన్‌ వాడీలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, రి-టైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవు మంజూరు చేయాలని, సర్వీసులో ఉండి చనిపోయిన వారికి రూ. 50 లక్షలు పరిహారంతోపాటు కుటుబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రేషన్‌కార్డులు తొలగించి సంక్షేమ పథకాలు అందకుండా చేయొద్దని, ఖాళీగా వున్న అంగన్‌వాడీ వర్కర్లు- హెల్పర్లు పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేయడం నేరమా అని లోకేష్‌ ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తించిన ఆశా వర్కర్లని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించిన ప్రభుత్వం వారికి కనీసం మాస్కులు, గ్లౌజులు, రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం వివక్షేనని మండిపడ్డారు. కోవిడ్‌ సోకి మరణించిన ఆశ కార్యకర్తలకు ఎటు-వంటి పరిహారం ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు. పరిహారం, బీమా సౌకర్యం, సెలవులు వంటి న్యాయమైన డిమాండ్లతో చలో కలెక్టరేట్‌ పేరుతో నిరసన తెలిపితే రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లని అరెస్టు చేయించారని మండిపడ్డారు. ఇప్పటికైనా అంగన్‌ వాడీలు, ఆశా కార్యకర్తలకి తానిచ్చిన హామీలు నెరవేర్చడంతోపాటు- న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుదని లోకేష్‌ స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement