Sunday, April 28, 2024

Andhra Pradesh – ఐక్య‌మ‌త్యంగా రాష్ట్రాన్నిఅభివృద్ధి చేసుకుందాం ..ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ పిలుపు

గణతంత్ర దినోత్సవ వేడుకల సంద‌ర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ నజీర్ జాతీయ ప‌త‌కాన్ని ఆవిష్కరించారు.. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏపీ సీఎం జగన్ దంపతులు, వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతిఒక్కరి పాత్ర ఉండాలని పేర్కొన్నారు. ఐకమత్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో వైద్య సేవలను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే ఉద్దేశంతో విలేజ్ క్లీనిక్‌లను ప్రారంభించామన్నారు. రైతుల కోసం 10,778 ఆర్బీకేలను ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పరిపాలన సులభతరం చేయాటానికి నూతన జిల్లాలు ఏర్పాట్లు చేసామన్నారు. కుల, మత, ప్రాంతాలకు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలు ప్రతి పౌరునికి చేరేలా కృషి చేస్తున్నామన్నారు. పాఠశాలలో నాడు- నేడు పథకంతో అనేక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. పాలన పరంగా అనేక సంస్కరణలు చేశామని వెల్ల‌డించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement