Friday, April 26, 2024

బొగ్గు నిల్వ‌లు పెంచుకోవాలి.. వేస‌విలో క‌రెంట్ స‌మ‌స్య రానివ్వొద్దు : ఏపీఈఆర్సీ

రాష్ట్రంలోని ధర్మల్‌ వి ద్యుత్‌ కేంద్రాల్లో వేసవిలోనూ నిరాటంకంగా, త క్కువ వ్యయంతో విద్యుత్‌ ఉత్పత్తికి ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పటి డిమాండ్‌ను అం చనావేసి ముందే బొగ్గు నిల్వలు పెంచుకోవాలని డి స్కమ్‌లకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏ పీఈఆర్‌సీ) సూచించింది. ఎక్స్ఛేంజీలు, మార్కెట్ల లో లభ్యమయ్యే విద్యుత్‌ ధరల అస్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తమవ్వాలని ఆదేశించింది. ప్రస్తు త పరిస్థితుల దృష్ట్యా ఎక్స్ఛేంజీలు మార్కెట్లలో లభ్య మయ్యే విద్యుత్‌ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, తగినంత బొగ్గు నిల్వలు లేకపోవడం వలన తక్కువ ధరల్లో విద్యుత్‌ అందించే థర్మల్‌ విద్యుత్‌ కేం ద్రాల నుండి విద్యుత్‌ తీసుకోలేని పరిస్థితులేర్పడ తాయని హెచ్చరించింది. ఎక్స్ఛేంజీలు, మార్కెట్లపై ఆధారపడితే విద్యుత్‌ పంపిణీ సంస్థలపైన అంతి మంగా వినియోగదారులపై అదనపు ఆర్థికభారం పడుతుందని తెలిపింది. ఈ విషయాలని దృష్టిలో ఉంచుకొని, రాబోయే వేసవిలో అదనపు వ్యయాన్ని తగ్గించేందుకు ఇప్పటినుండే కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించింది. ఇందులో భాగం గా అన్ని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు గడచిన రెండు మూడేళ్లలో వేసవిలో నెలకొన్న డిమాండ్‌ ఎంతమేర ఉందో దానిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన బొగ్గు నిల్వలను ఇప్పటినుండే అందుబాటులో ఉం చుకోవాలని తెలిపింది.

ఈమేరకు కార్యాచరణతో ముందుకు సాగాలని స్పష్టంచేసింది. ఈఏడాది ఫిబ్ర వరి నెలలో 400 మెగావాట్లు, మార్చి నెలలో 390 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే రోజంతా కొనడానికి విద్యుత్‌ పంపిణీ సంస్థలకు మండలి అనుమతించిం దని తెలియజేసింది. ఆప్రకారం, విద్యుత్‌ పంపిణీ సంస్థలు విజయవంతమైన బిడ్డర్లకు పైన చెప్పిన విద్యుత్‌ పరిమాణానికి కొనుగోలు పత్రం జారీ చే యాలని, వారితో దానికి సంబంధించిన స్వల్పకాలిక సరఫరా ఒప్పందం కుదుర్చుకోవాలని మండలి ఆదేశించింది. అయితే, వేలంపాటదారులు కోట్‌ చేసి న అధిక ధరల కారణంగా కమిషన్‌ మాత్రం ఏప్రిల్‌, మే నెలల్లో కొనుగోలుకు సంబంధించిన బిడ్లను మాత్రమే అనుమతించినట్లు తెలిపింది. అలాగే పిబ్ర వరి నుండి మే నెల వరకూ గరిష్ట వినియోగ సమ యాల్లో (సాయంత్రం 5 గంటల నుండి రాత్రి ఒంటి గంట వరకూ) మాత్రమే కొనుగోలుకు అనుమతిచ్చి నట్లు స్పష్టంచేసింది. ఈక్రమంలోనే డిస్కంలు బిడ్లను ఖరారు చేయడంలో జాప్యం కారణంగా జనవరి ప్రతిపాదన అసంబంద్ధంగా ఉందని ఏపీఈఆర్సీ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement