Sunday, April 28, 2024

Andhra Prabha Effect – చీటర్ చుట్టూ సైబర్ వల- అజ్ఞాతంలో టీసీఐ నిర్వాహకులు

మన్యంలో బోర్డు తిప్పి మాయాజాలంఆర్థిక లావాదేవీలపై పోలీసులు ఆరాఎస్‌బీఐ ఖాతాలు ఫ్రీజ్ చివరి మూడు రోజుల్లోనూ వసూళ్లు ఆంధ్రప్రభ కథనంతో టీసీఐ భాగోతం బట్టబయలు తక్కువ పెట్టుబడితో అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తే ఉచ్చు పన్ని.. మధ్యతరగతి జీవుల్ని నిలువునా అప్పుల ఊబిలోకి నెట్టిన నయా చీటర్ టీసీఐ బండారం బయటప‌డింది. బాధితులకు న్యాయం అందించేందుకు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు రంగంలోకి దిగారు. టీసీఐ భాగోతం మూలాలకు జల్లెడ పడుతున్నారు. ఏపీ, తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్థిక దోపిడీకి తెగబడిన టీసీఐ యాప్ అకృత్యాన్ని ‘ఆంద్రప్రభ’ వెలుగులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో.. కొందరు బాధితులు కళ్లు తెరిచారు. టీసీఐ సంస్థ ఎరలో తాము ఎలా నష్టపోయామో వివరిస్తూ బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయించటంతో.. టీసీఐ డొంక కదులుతోంది. తమ ఖాతాదారుల అకౌంట్లల్లో అకస్మాత్తు నగదు జమపై ఎస్బీఐ కూడా దృష్టి సారించింది. ఈ ఖాతాలను సీజ్ చేసి సైబర్ పోలీసులకు సహకరిస్తున్నట్టు సమాచారం.

చింతూరు, (ప్రభన్యూస్‌): ఈజీ మనీతో కోట్లకు కోట్ల అక్రమార్జనకు తెగించే అక్రమార్కులు అమాయక జనాన్ని దోచేస్తున్నారు. ఈ దోపిడీదారులు ఎంతటికైనా తెగిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బును సంపాదించాలనే అత్యాశతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసగాళ్ల ఉచ్చులో పడి ఎంతో మంది లక్షలు పోగొట్టు-కుని లబోదిబోమంటు-న్నారు. అమాయక మన్యం ప్రజలను దోచుకున్న టీసీఐ యాప్‌ నిర్వహణ సంస్థ కుచ్చుటోపి పెట్టి బోర్డు తిప్పేసింది.

ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మన్యం జనం సహా ఆంధ్ర, తెలంగాణ మనం ప్రజలను దోచేసింది. ఉంటే ఆంధ్రప్రభ దినపత్రికలో ”మన్యంలో టీసీఐ యాప్‌ పేరుతో కుచ్చుటోపీ” అనే కథనంతో అసలు బాగోతం బయట పడగా.. టీసీఐ యాప్‌ నిర్వహాకులు కంగుతిన్నారు. ఆ యాప్‌ను పూర్తి స్థాయిలో మూసివేశారు. ఎలాగూ యాప్ మూయకతప్పదని .. చీకటి పడక ముందే ఇంటిని చక్కదిద్దేశారు.

“మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి చెల్లిస్తాం, మరో రూ. 6,800లు చెల్లించండి మరుసటి రోజు మీ పెట్టుబడి నగదు మీ ఖాతాలో జమ చేస్తామని బాధితులకు మళ్ళీ మరో సందేశంతో నమ్మబలికారు. అంతే మరి కొంత మంది బాధితులు మళ్ళీ నమ్మి రూ. 6,800లు డిపాజిట్‌ మళ్ళీ మోసపోయారు. ఈ టీసీఐ యాప్‌ పేరుతో మన్యంలో అతి తక్కువ మంది లాభపడ్డారని ఎక్కువ మంది మోసపోయారని బాధితులు వాపోయారు. ఈ చైన్‌ లింక్‌ లో ఎక్కువ మందిని చేర్పించిన కొందరికే డబ్బులు దక్కగా.. మిగిలిన పెట్టుబడిదారులు పూర్తిస్థాయిలో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

చివరి మూడు రోజుల్లో… మరో దగా

ఈ యాప్‌ నిర్వహాకులు చివరి మూడు రోజులు పెట్టుబడి దారులతో ఒక ఆట ఆడుకున్నారంటే అతిశయోక్తి కాదు. “మీ పెట్టుబడికి మూడు రోజుల్లోనే మూడు రెట్ల ఆదాయం జమ చేస్తామని టీసీఐ నిర్వహాకులు ఆఫర్‌ ప్రకటించారు. యాప్‌లో రూ. 16 వేలు, 26 వేలు, 36 వేలు, 46 వేల నుంచి రూ.లక్ష వరకూ వివిధ స్లాట్ ల్లో వసూళ్లకు తెరతీశారు. బాధితులను చక్కగా బురిడీకొట్టించారు.

- Advertisement -

మూడు రోజుల్లో రెట్టింపు ఆదాయంపై ఆశతో ఏమి ఆలోచించకుండా లక్షల్లో పెట్టుబడి పెట్టి బాధితులు నిండా మునిగి పోయారు. ఈ యాప్‌ ఆశతో అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టినోళ్లందరూ ఆర్ధికంగా దెబ్బతిన్నారు.

సైబర్ పోలీసుల రంగప్రవేశం

ఇక ఈ టీసీఐ యాప్‌ ఘాతంతో దెబ్బతిన్న బాధితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. టీసీఐ తమను మోసగించిన తీరును వివరిస్తూ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన సైబర్‌ పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ యాప్‌ ఆధారంగా ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో అధిక మొత్తంలో నగదు జమ జరిగిన ఖాతాదారులను గుర్తించి. ఆ ఖాతాలను బ్యాంక్‌ అధికారులు ఫ్రీజ్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకును ఆశ్రయించగా.. లిఖిత పూర్వకంగా నగదును ఎవరు ఎక్కడ నుంచి పంపించారు. ఇంత డబ్బు ఎలా సమకూరింది అనే అంశాలను పూర్తిస్థాయిలో వివరిస్తూ లిఖిత ప్వూర్వకంగా ఇస్తే అప్పుడు బ్యాంకు ఖాతాను వినియోగంలోకి తీసుకోస్తామని చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ యాప్‌తో నష్టపోయిన యువత, ఉద్యోగులు, వ్యాపారులు అంతర్మథనంలో అల్లాడిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement