Monday, December 9, 2024

ఈనెల 14న రాప్తాడులో సీఎం జగన్ పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన నేతలు

ఈనెల 14న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లిలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈరోజు ఉదయం పరిశీలించారు. రైతులకు క్రాఫ్ ఇన్సూరెన్స్ విడుదలకు సంబంధించి ముఖ్యమంత్రి చెన్నేకొత్తపల్లి సభలో బటన్ నొక్కి ప్రారంభించనున్నారు. సభా వేదిక, హెలిప్యాడ్ కోసం తలశిల రఘురాం, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్థలాలను పరిశీలించారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సౌకర్యవంతంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అనంతరం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కలెక్టర్ బసంత్ కుమార్, ఎస్పీ రాహుల్దేవ్ సింగ్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులతో తలశిల రఘురాం గారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై చర్చించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement