Thursday, May 2, 2024

అనంత క‌లెక్ట‌ర్ పై ఎమ్మెల్యే కేతినేని వీరంగం…

అనంతపురం: జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఇగోయిస్ట్ అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విరుచుకుప‌డ్డారు… అనంత‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, క‌లెక్ట‌ర్ పై ఒంటికాలిపై లేచారు.. గంధం చంద్రుడు ఇవాళ ఉండి రేపు పోతార‌ని, ఎవడిని నాశనం చేయడానికి గంధం చంద్రుడు పుట్టారంటూ చిందులేశారు. పత్రికల్లో హనీట్రాప్ రాకపోతే ఎప్పుడో పోయేవాడని చెప్పారు. కలెక్టర్‌ కులాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. జిల్లా మేజిస్ట్రేట్ అయితే చంపేస్తావా? అని కేతిరెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలం గాడిదలు కాయడానికి ఉన్నామా? అంటూ విరుచుకుప‌డ్డారు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలెక్టర్‌ లెక్కచేయట్లేదని విమర్శించారు. త్వ‌ర‌లోనే ఇక్క‌డి నుంచి కలెక్ట‌ర్ వెళ్ల‌డం ఖాయ‌మంటూ సెల‌విచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement