Wednesday, May 8, 2024

Allagadda – జన సునామీకి తాడేపల్లి పిల్లికి వణుకు – చంద్ర‌బాబు

కర్నూల్ బ్యూరో – ఆళ్లగడ్డలో టిడిపి బహిరంగ సభకు హాజరైన జనం ను చూస్తే తాడేపల్లిలో వైసిపి పిల్లి వణుకుతుందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా నిర్వహించిన సభకు అశేష జన సందోహం హాజరయ్యారు. ఈ సందర్భంగా సభకు హాజరైన జనం ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసిపి పాలన పేదలకు శాపంగా మారిందని చంద్రబాబు జగన్‌పై విమర్శలు చేశారు. అనర్హులకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆయన ఆరోపించారు.

నంద్యాల జిల్లా ప్రజల జోరుకు వైసీపీ ప్రభుత్వం పతనం కావడం ఖాయమన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న కొలువైన జిల్లా అన్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ ప్రాంతం ఇక్కడే ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
జగన్ పాలనలో ఆంధ్రరాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆడుకుంటుందని చంద్రబాబు నాయుడు అగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనకు పరిశ్రమలు మూసివేసే పరిస్థితి నెలకొందన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు ఆరోపించారు.

మన భూముల్లో జగన్ బొమ్మలేంటి.
మన పొలాల్లో జగన్ బొమ్మలేంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రి రంగులు, బొమ్మల పిచ్చొడని ఎద్దేవా చేశారు.ప్రజలకు ఏమి చేశారని వైసీసీ యాత్రలు చేపట్టిందని బాబు ప్రశ్నించారు. జగన్ రెడ్డి రాయల సీమ ద్రోహి అని, జగన్ మాటలు విని మరోసారి మోసపొవద్దని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల జీవితాలతో జగన్ చెలగాట మాడుతున్నాడని విమర్శించారు. రాయలసీమకు గోదావరి నీళ్లు తీసుకురావడమే తన కల, గోదావరి నీళ్లు తెచ్చి రాలయసీమను సస్యశ్యామలం చేస్తానని చంద్రబాబు అన్నారు. జగన్ పాలనలో రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు అయినా వచ్చిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో తాము చేసిన ఖర్చులో 20 శాతం కూడా వైసీపీ ఖర్చు చేయలేదని మండిపడ్డారు. ఆంగళ్లలో ఉన్నప్పుడు తనపై తప్పుడు కేసు పెట్టారని మండిపడ్డారు.

నంద్యాల ప్రజల ఉత్సాహం చూస్తే వైకాపా పతనం ఖాయం
నంద్యాల జిల్లా ప్రజల ఉత్సాహం చూస్తోంటే.. వచ్చే ఎన్నికల్లో వైకాపా పతనం ఖాయమనిపిస్తోందని తెదేపా అధినేత అన్నారు. జన సునామీ చూసి ఇప్పటికే టిడిపి ఎంపీలు ,ఎమ్మెల్యేలు వణుకుతున్నారన్నారు. అంతకుముందు నంద్యాల జిల్లా ప్రజలకు ఆయన కొత్త ఏడాది, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జిల్లాలోని ఏడు స్థానాల్లో తెదేపా గెలవబోతోందన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో యువత నిరుద్యోగులుగా మారిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఎక్కడ చూసినా విధ్వంసక పాలన. రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం కావాలా.. రాతి యుగం వైపు వెళ్తారా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. స్వర్ణ యుగం కోసం నాతో వస్తారా.. అని పిలుపునిచ్చారు. అనర్హులను అందలం ఎక్కించి అనేక బాధలు పడుతున్నాం. భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకొని అనేక కష్టాలు పడుతున్నాం. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి అందరూ ఓటేశారు. ఒక్కసారే అని కరెంట్‌ తీగలు పట్టుకుంటే షాక్ కొట్టక తప్పదన్నారు.జగన్‌కు తెలిసింది.. రద్దులు.. కూల్చివేతలు.. దాడులు, కేసులు మాత్రమే చంద్రబాబు ఎద్దేవ చేశారు.

రాయలసీమ ద్రోహి.. జగన్‌..

- Advertisement -

నందికొట్కూరుకు రూ.650 కోట్లతో మెగా సీడ్‌ పార్క్‌ తేవాలనుకుంటే జగన్ వచ్చాక వాటిని సర్వనాశనం చేశార న్నారు. ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్‌ పార్కును అటకెక్కించారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఓర్వకల్లుకు 15 నెలల్లోనే విమానాశ్రయం తెచ్చిన ఘనత టిడిపిదే అన్నారు. 6 మెగావాట్లతో సోలార్‌ పార్క్‌ తెచ్చేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేశారు. రాయలసీమలో అన్ని వనరులు ఉన్నాయి. సీమలో నీటిపారుదల ప్రాజెక్టులు మొదలుపెట్టింది ఎన్టీఆర్‌ అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ నీరు ఉంటే రతనాలు పండుతాయ‌ని, స్థానిక వనరులు వాడుకుంటే బయటకు వెళ్లి పనిచేసే అవసరం లేదన్నారు. అవుకు టన్నెల్‌ను మేమే పూర్తి చేసినట్లు బాబు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా అలగనూరుకు మరమ్మతులు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. జగన్‌ వచ్చాక సీమకు ఒక్క ప్రాజెక్టు అయినా వచ్చిందా?ప్రాజెక్టులపై మేం ఖర్చు చేసిన దానిలో 20 శాతం కూడా జగన్‌ ఖర్చు చేయలేదు. రాయలసీమ ద్రోహి.. జగన్‌ ఘాటుగా విమర్శించారు.

భూ రక్ష చట్టం అమలైతే ఇబ్బందులే ..
మీ భూమి పాస్‌బుక్‌లో జగన్‌ బొమ్మ ఎందుకు? రికార్డులు తారుమారు చేసి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భూ రక్ష చట్టం అమలైతే అనేక ఇబ్బందులు వస్తాయన్నారు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అని ప్రకటించిన జగన్ ఇచ్చారా?మెగా డీఎస్సీ అన్నారు.. ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదనీ ఇది ముమ్మాటికి నిరుద్యోగులను వహించడమే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వేధింపులతో అమరరాజా, జాకీ కంపెనీలు వెనక్కి వెళ్లిపోయినట్లు చెప్పారు. తిరుపతిని ఆటోమొబైల్‌ హబ్‌గా చేయాలని అనేక కంపెనీలను తెచ్చాం. కియా పరిశ్రమను తెచ్చిన ఘనత మాదే అన్నారు.వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఐదేళ్లలో మీ జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా?జగన్‌ మాయమాటలు నమ్మి మరోసారి మోసపోయేవారు ఎవరూ లేరు. యువత భవిష్యత్తుకు నాదీ గ్యారంటీ. యువత తెదేపా-జనసేన జెండా పట్టుకొని ప్రజల్లో చైతన్యం తేవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే నాతో కలిసి నడవాలన్నారు. నేను అందరివాడిని.. అదే నా ప్రత్యేకత” అని చంద్రబాబు పేర్కొన్నారు.ఉమ్మడి కర్నూల్ జిల్లాకు పరిశ్రమలు తెచ్చిన ఘనత టీడీపీకే చెందుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement