Sunday, May 19, 2024

భ‌క్తుల‌తో పోటెత్తిన శైవ క్షేత్రాలు – శివ‌నామ స్మ‌ర‌ణ‌తో మారుమోగుతున్న ఆల‌యాలు..

తెలుగు రాష్ట్రాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున శివాలయాలకు పోటెత్తారు. జగాలను ఏలే జంగమ దేవుడు, తినేత్రుడు, లింగాకార రూపుడైన శివునికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలంలో తెల్ల‌వారుఝాము నుంచే భ‌క్తులు పోటెత్తారు.. కృష్ణాన‌దిలో స్నాన‌మాచ‌రించి భ‌క్తులు ప‌ర‌మేశ్వ‌రుడిని ద‌ర్శించుకుంటున్నారు.. అన్ని శివాల‌యాల‌లో ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మారుమోగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు రాజన్నను దర్శించుకుంచేకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టీటీడీ, రాష్ట్రప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటల నుండి స్వామివారి కల్యాణ మండపంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన జరుగుతుంది. రాత్రి 11:30 గంటలకు లింగోద్భవ సమయంలో స్వామివారికి 11 మంది రుత్వికులచే ఆలయ అర్చకులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు
మేళ్లచెరువు లోని స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివరాత్రి వేడకుల్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement