Tuesday, May 7, 2024

AP | భలే భలే ఫిషింగ్‌.. వలలకు చిక్కుతున్న భారీ చేపలు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో : సుదీర్ఘ విరామం తరువాత విశాఖ సాగరతీరంలో మత్స్యకారుల వలలకు భారీగానే చేపలు లభ్యమవుతున్నాయి. కొంతకాలం క్రితం వేటకు విరామం ప్రకటించారు. ఆ తరువాత తిరిగి ఇటీవలే మత్స్యకారులు వేట ప్రారంభించడం అనుకోకుండా ఫిషింగ్‌ హార్బర్‌లో అతి పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. మరికొన్ని బోట్లు బాగా దెబ్బతిన్నాయి. అయినప్పటికి తిరిగి మత్స్యకారులు కోలుకొని తిరిగి వేటకు శ్రీకారం చుట్టారు.

అయితే మత్స్యకారులకు తాజాగా లభ్యమవుతున్న మత్స్య సంపద కారణంగా కొంత ఊరట లభిస్తుంది. గత వారం రోజులుగా మత్స్యకారుల వలలకు ఆశించిన కంటే అధికంగా వివిధ రకాల చేపలు లభ్యమవుతున్నాయి. ఇందులో సూరతో పాటు అనేక రకాల చేపలు ఉండడం అందులో ఒక్కొక్క చేప 50 నుంచి సుమారు 100 కేజీల వరకు బరువు ఉండడం, అది మార్కెట్‌లో కేజి రూ.100 నుంచి 150 లవరకు గిరాకి పలుకుతుండడంతో పలువురు మత్స్యకారులు సంబరపడతున్నారు. తెల్లవారు జామునే వేట ఉత్సాహంగా సాగిస్తున్నారు. అయితే ఎక్కువ దూరం వెళ్లి వేట సాగించే వారికి అరుదైన , డిమాండ్‌ కలిగిన చేపలు కూడా లభ్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో చేపలు ఎగుమతులు జోరందుకున్నాయి. స్థానికంగా కూడా అమ్మకాలు ఘననీయంగా పెరిగాయి.

ప్రమాదం జరిగిన బోట్లు తొలగింపు..

ఇటీవలే ఫిషింగ్‌ హార్బర్‌ఒలో పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసకుంది. అయితే క్రమేపీ వాటి తొలగింపులకు శ్రీకారం చుట్టారు. తాజాగా సోమవారం భారీ క్రేన్లతో దగ్ధమైన, దెబ్బతిన్న బోట్లను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పాతవాటి స్థానంలో తిరిగి కొత్త బోట్లు త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement