Saturday, May 4, 2024

తాలిబన్ల ఒత్తిళ్లకు.. ఆఫ్గాన్ ప్రజల ఉక్కిరి బిక్కిరి..

కాబూల్‌, (ప్ర‌భ‌న్యూస్): అఫ్గానిస్తాన్ లో పరిస్థితులు అత్యంత దయనీయంగా క‌నిపిస్తున్నాయి. తాలిబన్లు అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా పర్యవసానాలు సవ్యంగా కనిపించడం లేదు. ఓవైపు అరాచక పరిపాలన భయాలు, ఇంకొకవైపు తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం పౌరులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దాంతో కొత్త జీవితం కోసం, పిల్లాజెల్లతో కట్టుబట్టలతో దేశం విడిచివెళ్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో మొదలైన వలసలు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సరిహద్దులు దాటేందుకు అనివార్య పరిస్థితులలో చట్టవిరుద్ధ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. మానవ అక్రమరవాణా దారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. సరిహద్దులు దాటించేందుకు సహకరిస్తున్నారు. తాలిబన్‌ ప్రభుత్వంనిస్సహా యంగా మారింది.

పాకిస్తాన్‌, ఇరాన్‌ సరిహద్దులకు దగ్గరగా ఉన్న మారుమూల పట్టణం జరంజ్‌ ఆఫ్గాన్ ల‌ అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రంగా మారింది. భారీ మానవతా, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గానిస్తాన్ కుటుంబాలు తీవ్ర నిరాశకు గురవుతు న్నాయి. విధిలేక వారు మానవ అక్రమ రవాణా దారులను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో కారులో 18-20 మందిని కుక్కేసి మరీ సరిహద్దులు దాటిస్తున్నారు. జరంజ్‌ నుంచి ఎడారి ప్రాంతం మీదుగా ఏడుగంటలపాటు ప్రయాణించి వీరిని పాకిస్తాన్‌ చేరుస్తున్నారు. వలసలకు సిద్ధమైన వారిని అక్రమంగా ఇరాన్‌కు రవాణా చేస్తున్నారు. తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దేశం విడిచిపెట్టిన వారి సంఖ్య రెండింతలు పెరిగిందని ట్రాఫికర్లు (మానవ అక్రమ రవాణాదారులు) బీబీసీకి తెలిపారు.

ఇమ్మిగ్రేషన్‌, వీసాల అవసరం లేకుండా సరిహద్దులు దాటిస్తున్నందున అఫ్గానిస్తాన్ లు ట్రాఫికర్లను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు తక్కువ రుసుము ట్రాఫికర్లు వసూలు చేస్తున్నారు. వలస వెళ్తున్న వారిలో ఎక్కువ మంది నిరాశకు గురైన పురుషులే. వారంతా పొరుగుదేశంలో ఉపాధి దొరుకుతుందనే ఆశతో దేశం విడిచి పారిపో తున్నారు. తాలిబన్ల ప్రవేశానికి ముందు అఫ్గానిస్తాన్ ప్రభుత్వంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఓ మహిళ కూడా ట్రాఫికర్ల సహాయంతో దేశం విడిచివెళ్లే సాహసం చేసింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement