Tuesday, May 14, 2024

శివ… !!శివ… !! మహాశివరాత్రి రోజు రేవ్ పార్టీలా ?

మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్‌ శివారులోని సంస్థాన్ నారాయణఫురంలో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అంతే కాకుండా 90 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చూసిన మరికొంత మంది యువకులు పరారయ్యారు. వారి కోసం పోలీసుల గాలింపు చర్యలను చేపట్టారు.

గురువారం రాత్రి రేవ్ పార్టీ జరుగుతోందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌కు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేశారు. అయితే అక్కడ పెద్దమొత్తంలో మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతీయువకులకు సంబంధించి 60 బైక్ లు 14 కార్లును సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement