Sunday, April 28, 2024

సభలు లేవు… షోలు లేవు!

హడావుడి లేకుండానే హుజూరాబాద్‌ ప్రచారం
ప్రచారంపై ఎన్నికల సంఘం నిబంధనల ఎఫెక్ట
ఫోకస్‌ మార్చిన ప్రధాన రాజకీయ పార్టీలు
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న ఎన్నికకు.. ప్రచారం ఏ రేంజ్‌లో ఉంటుం దో.. ఎందరో అగ్రతారలు తరలివస్తారోనని నేతలు, స్థానిక ప్రజలు ఎదురుచూడగా.. ఇందుకు భిన్నంగా సాదాసీదాగా ప్రచారం సాగుతూ చివరికొచ్చేసింది. బహిరంగసభలు లేవు.. భారీ రోడ్‌షోలు లేవు. ఇంతటి చప్ప ప్రచారం మేం చూడలే అని ఓటర్లు, లీడర్లు అంటు న్నారు. ఓటర్లకు మర్యాదలు, లీడర్ల కష్టం పక్కనపెడితే సభలు, షోలపై ఫోకస్‌ పెట్టి జనసమీకరణ చేసే పని ఈ సారి లీడర్లకు లేకుండా పోయింది. ఏ ఉప ఎన్నికైనా భారీరోడ్‌షోలు.. బహిరంగ సభలు కామన్‌. ఈ రెండు లేకుండా సాగుతోంది హుజురాబాద్‌ బైఎలక్షన్‌. నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోనూ సభలకు ఈసీ నో చెప్పడంతో ప్రత్యామ్నాయాలపై పార్టీలు దృష్టిసారించాయి. కరోనా సమయంలో నిర్వ హించిన ఎన్నికల్లో కొన్నిచోట్ల వైరస్‌ ఉధృతికి ప్రచార సభలు, రోడ్‌షోలు కారణమయ్యాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఈసీ తీరుపై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఈనెల 30 నిర్వహించే ఉప ఎన్నికలపై ఆంక్షల కొరఢా ఝుళిపించింది ఎన్నికల కమిషన్‌. ప్రచారంలో కీలకంగా భావించే రోడ్‌షోలను బ్యాన్‌ చేసిం ది. వెయ్యి మందితోనే బహిరంగ సభ పెట్టుకోవాలి. ఒక పెద్ద నేతను తీసుకొచ్చి రోడ్‌షోలు లేకుండా.. వెయ్యి మందితో సభ అంటే తేలిపోతుంది. అందుకే ఇంటింటి ప్రచారానికి.. ఇతర మార్గాలకు పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. షెడ్యూల్‌ రాకముందే హుజురాబాద్‌లో దళితబంధు అట్టహాసంగా ప్రారంభించి.. టీఆర్‌ఎస్‌ ప్రచారానికి సీఎం కేసీఆర్‌ ఊపుతీసుకొచ్చారు. ఈనెల 27న హుజురాబాద్‌కు ఆనుకుని ఉండే పెంచికల్‌పేటలో భారీ సభకు ప్లాన్‌ చేసినా.. ఈసీ కొత్తగా జారీ చేసిన ఆదేశాలతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది అధికార పార్టీ. హుజురాబాద్‌లో ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడతను ముగించి భారీ సభకు ప్లాన్‌ చేసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా నాడు ఎన్నికల కోడే అడ్డంకిగా మారింది. దాంతో హుస్నాబాద్‌లో సభ నిర్వహించి మమ అనిపించారు. అప్పట్లో హుజురాబాద్‌కు ఆనుకున్న ప్రాంతాల్లో కోడ్‌పై ఆదేశాలు లేకపోవడంతో బీజేపీ సభకు ఆటంకం లేకుండాపోయింది. ఇప్పుడు వారికీ లేదు.. వీరికీ ఛాన్స్‌ లేదు.సాధారణంగా పెద్ద నేతల రోడ్‌షోల లేదా బహిరంగ సభ అంటే భారీగా జనసమీకరణ చేయాలి. బోల్డంత ఖర్చు చేయాలి. ఈసీ పుణ్యమా అని నాయకులకు ఇప్పుడా బాధ తప్పింది. ఖర్చు మిగిలింది. అలా మిగిలిన ఖర్చును ఉప ఎన్నికలో ఇంకోలా వినియోగించే వెసులుబాటు పార్టీలకు చిక్కింది. పైకి సభలు, రోడ్‌షోలు లేవని నేతలు విచారం వ్యక్తం చేస్తున్నా.. అంతరంగిక సమావేశాల్లో మాత్రం ఎన్నికల సంఘం తమ నెత్తిన పాలు పోషిందని సంతోష పడుతున్నారు. ఇతరత్రా వ్యూహాలపై ఫోకస్‌గా పనిచేసే అవకాశం నేతలకు చిక్కింది.

ఎన్నికల సంఘం ఆంక్షలపై సర్వత్రా చర్చ
హుజురాబాద్‌లో ఈనెల 30న పోలింగ్‌ జరగనుండగా.. 27తో ప్రచారానికి ఫుల్‌ స్టాప్‌ పడనుంది. ప్రచారానికి మిగిలి ఉన్న మూడు, నాలుగురోజులను ప్రధానపార్టీలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే హుజురాబాద్‌ను చుట్టేసిన టీఆర్‌ఎస్‌, బీజేపీలు.. పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాయి. అయితే ఓటర్ల అటెన్షన్‌ తీసుకొచ్చేందుకు.. లాస్ట్‌ పంచ్‌ ఇచ్చేందుకు సభలకు ప్లాన్‌ వేసినా ఈసీ చెక్‌ పెట్టింది. దీంతో ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలపై ప్రధాన పార్టీల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement