Wednesday, May 1, 2024

‘దసరా’ తర్వాతే దేవర సెట్‌లో జాన్వీ కపూర్..

టాలీవుడ్ లో “దేవర” సినిమాతో అడుగుపెడుతున్న జాన్వీ కపూర్ ఈ నెలలో ఎన్టీఆర్‌తో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది. అయితే, మూవీలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేయడంలో ఆల‌స్యం అయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో పాటలు, ఇతర సన్నివేశాల షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడింది.

కాగా, వచ్చే నెల దసరా పండుగ సందర్భంగా జాన్వీ కపూర్ మూవీ షూటింగ్ ప్రారంభించనున్నారు. అక్టోబర్‌లో కొరటాల శివ డ్రామా సన్నివేశాలు, పాటల చిత్రీకరణను ప్రారంభించనున్నారు. విస్తృతమైన VFX అవసరమయ్యే ప్రధాన యాక్షన్ ఎపిసోడ్‌లు ఈ నెలాఖరు నాటికి పూర్తవనున్న‌ట్టు స‌మాచారం. ఈ మూవీలో జాన్వీ కపూర్ పల్లెటూరి అమ్మాయిగా క‌నిపించ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement