Tuesday, April 30, 2024

థియేటర్లలో ‘7G బృందావన్ కాలనీ’ సందడి.. రీ-రిలీజ్‌లో సూపర్ రెస్పాన్స్

సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన కల్ట్ లవ్ స్టోరీ 7G బృందావన్ కాలనీ నిన్న థియేటర్లలో తిరిగి విడుదలైంది. ఈ మూవీలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా, మూవీ రీ-రిలీజ్‌కి ప్రేక్ష‌కుల‌నుండి అధిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. థియేటర్లలో అభిమానులు సంద‌డి చేసే వీడియోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా రీ-రిలీజ్ అయిన తొలిరోజు 1.04 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చాలా సంవత్సరాల క్రితం విడుదలైన ఈ మూవీకి, ఇది నిస్సందేహంగా అద్భుతమైన నెంబ‌ర్స్ అనే చెప్పాలి. ఈ సినిమా మరికొన్ని రోజులు థియేటర్లలో రన్ అవుతుంది. 7G బృందావన్ కాలనీ తమిళంలో 7G రెయిన్‌బో కాలనీగా ఏకకాలంలో రూపొందించబడింది.

శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎం రత్నం దీన్ని నిర్మించారు. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు. చంద్రమోహన్, సుమన్ శెట్టి, సుధ, సుదీప పింకీ, సవితా ప్రభునే, మనోరమ కీలక పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement