Sunday, April 28, 2024

గణేశ పురాణం

(గత సంచిక తరువాయి)

భాద్రపద శుద్ధ చవితినాడే గణశ నవరాత్రులు ఎందుకు చేస్తారు?
ఆ దినము నాడే గణశునికి ఏనుగు తల అతికించి, సజీవుని చేసి దేవుడు/దేవతలంతా తొలిపూజ చేయనారంభించారు గనుక.
గణశ నిమజ్జనం ఎందుకు చేస్తారు?
గణశుని ప్రతిమ మట్టితో చేసి, 21 రకాల పత్రితో పూజించడం సంవత్సరమంతా ఆరాధించడం అందరికీ వీలుకాదు. ముప్పూట లా ధూప, దీప నైవేద్యాలు జరపడమూ వీలుకాదు. అందుకని మట్టి ప్రతిమను శాస్త్రోక్తంగా బావులు, వాగులు, చెరువులు, నదులలో నిమజ్జనం చేస్తారు. 9 దినాలు ఆరాధించి చివరకు ఉద్వాసన చెప్పి, క్షమానఫలు కోరి, తప్పులు మన్నించమని గుంజీలు తీసి, నదిలో జారవిడుస్తారు. అది ఆనవాయితీ. పంచలోహ గణపతులను నిమ జ్జనం చేయరు.
గణపతి జన్మ గూర్చి అన్ని పురాణాల్లో ఒకే రకంగా ఉందా?
లేదు. భిన్న భిన్న అభిప్రాయ భేదాలున్నాయి.
గణశ చవితినాడు 21 రకాల పత్రితో ఎందుకు పూజిస్తారు?
మనకు మేలు 21 రకాలుగా జరగాలని గణపతిని తొలుత పార్వతి మట్టి లేదా నలుగు పిండితో చేసింది. గణపతి, ఆయన అన్న స్కందుడు ఇరువురూ పార్వతికి సహజంగా జన్మిం చలేదు. కారణం ఏమంటే శివుడు కామదహనం చేసిన దినాన పార్వతిని ”నీవు సహజంగా నీ సంతానానికి జన్మనీయవు” అని శపించింది. కనుక మట్టి భూమి నుండి వస్తుంది. ప్రకృతి లో మట్టితో పాటు ఇంకా ఉన్న పత్రితో గణశుని 9 దినాలు ఆరాధించి, చివరకు అన్నింటితో పాటుగా గణవ మట్టి ప్రతిమలను నిమజ్జనం చేస్తారు.
వినాయకునికి బాగా ఇష్టమైన నైవేద్యాలు ఏవి?
గరిక, బెల్లం, కుడుములు, ఉండ్రాళ్ళు.
తులసి దళాన్ని నిత్యపూజలో గణపతికి ఎందుకు వాడరు?
1వ కారణం: తులసి కన్యగా ఉన్నప్పుడు బ్రహ్మచారిగా ఉన్న గణపతిని పెళ్ళి చేసు కొమ్మంటే ఆయన నిరాకరించాడు. ఆమె పట్టు వీడలేదు. స్వామి ఆగ్రహించి నీ దళాన్ని నా పూజలో వాడకుండు గాక అని శపిస్తే తర్వాత ఆమె క్షమాపణలు కోరితే వినాయ క చవితి నాడు మాత్రం నీ దళం వాడుతారు అని మినహాయింపు ఇచ్చాడట ఆయన.
2వ కారణం: తులసి భర్త జలంధరుడిని శివుడు వధిస్తాడు. శివుని కోపం తెప్పించిన వాని భార్య గనుక తులసి దళాన్ని గణశుని నిత్య పూజలో వాడరు.
చంద్రుని చవితినాడు ఎ ందుకు చూడరు?
పొట్ట నిండా బాగా తిని నడుస్తున్న గణశుడు ఒకదినం కైలా సంలో వంగబోయాడు. పొట్ట పగిలింది. గణశుడు విగత జీవుడ య్యాడు. చంద్రుడు గణశుని చూసి నవ్వాడు. పార్వతికి కోపం వచ్చింది. చంద్రుని ముఖం చూసినవారు నీలాపనిందల పాలౌదు రు గాక అని శపించగా, ముల్లోకాలూ అదెలా సాధ్యమని తల్లడిల్ల గా గణశ చవితినాడు గణశుని పూజించక చంద్రుని చూసినవారు నీలాపనిందల పాలౌతారు అని పార్వతి తన శాపాన్ని సవరించగా, శివుడు గణశునికి మళ్ళీ పునర్జన్మనిచ్చాడు. పార్వతి చంద్రునికిచ్చి న శాపవశాత్తు, చవితినాడు భయం చేత చంద్రుని చూడరు. పార్వ తి చంద్రుని క్షమించింది. చంద్రుడు క్షమార్పణలు చెప్పగా, తాను చంద్రవంకను శిగలో తీర్చి,చంద్రకళాధరియైంది. అలాగే శివుడూ చంద్రకళాధరుడైనాడు.
గణశుని పూజించిన వారికి సంకల్ప సిద్ధి తథ్యమా? తథ్యం.
గణపతి ప్రణవ స్వరూపుడా?
ఔను, ఈ విషయం సూత మహర్షి శౌనకాది మునులకు గణశ పురాణ మొదటి అధ్యా యాన చెప్పాడు.
సృష్టి, స్థితి, లయ కారకుడు గణశుడా?
ఔను అంటోంది గణశ పురాణం. గణశుడు ఓంకారం నుండి వచ్చాడంటోంది.
గణశ స్వరూపం ఎలా తెలుస్తుంది? గణశ పురాణం కథనం వలన.
గణశుడు ఆనంద స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడా? ఔను.
గణశ మంత్రములు ఎన్ని కలవు?
ఏడుకోట్ల గణశ మంత్రము లున్నట్లు చెప్పబడింది.
(సశేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement